సీఎం అవ్వడం కోసం రాలేదు.. కేంద్రం దాదాగిరిని అనుమతించం.. గోవాలో మమతా బెనర్జీ
చేపలు, ఫుట్‌బాల్ అనేవి బెంగాల్, గోవాలను (Goa) కలిపే రెండు అంశాల అని పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. రాష్ట్రాలలో కేంద్రం దాదాగిరి చేయడాన్ని తాను అనుమతించబోనని అన్నారు.
చేపలు, ఫుట్‌బాల్ అనేవి బెంగాల్, గోవాలను (Goa) కలిపే రెండు అంశాల అని పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. రాష్ట్రాలలో కేంద్రం దాదాగిరి చేయడాన్ని తాను అనుమతించబోనని అన్నారు. తాను అధికారం కోసం గానీ, గోవా ముఖ్యమంత్రి కావడానికి గానీ ఇక్కడకు రాలేదని స్పష్టం చేశారు. గోవాలో మూడు రోజులు పర్యటన నిమిత్తం మమతా బెనర్జీ.. గురువారం గోవాకు చేరుకున్నారు. శుక్రవారం నటి నఫీసా అలీ మమతా బెనర్జీ సమక్షంలో టీఎంసీలో చేరారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న గోవాలో మమతా బెనర్జీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘ఇకపై ఢిల్లీ నుంచి బెదిరింపులు ఉండవు. నేను బయటి వ్యక్తిని కాను. గోవాకు సీఎం కావాలని అనుకోవడం లేదు. నేను భారతీయురాలిని. నేను ఎక్కడికైనా వెళ్లగలను. బెంగాల్ నా మాతృభూమి. గోవా కూడా నా మాతృభూమి. నేను గోవాకు వస్తాను.. కానీ నా పోస్టర్లను వారు ధ్వంసం చేస్తారు. వారు (బీజేపీని ఉద్దేశించి) మనసులు కలుషితం అయి ఉన్నాయి. వారు నాకు నల్ల జెండాలు చూపించారు. నేను వారికి నమస్తే అన్నారు’అని పనాజీలో తన మొదటి ప్రసంగంలో మమతా బెనర్జీ అన్నారు.
Also read: రోమ్ నగరం చేరుకున్న ప్రధాని మోదీ.. జీ 20 సదస్సు, పోప్ ఫ్రాన్సిన్‌తో భేటీ.. ఆ తర్వాత బ్రిటన్‌కు..
‘మేము ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తాము. గోవా చాలా అందంగా ఉంది. నేను ఇక్కడ అధికారం చేజిక్కించుకోవడానికి కాదు.. సహాయం చేయడానికి ఇక్కడకు వచ్చాను. మీరు చేపలను ప్రేమిస్తారు.. మేము చేపలను ప్రేమిస్తాము. మీరు ఫుట్‌బాల్‌ను ప్రేమిస్తారు.. బెంగాల్ ఫుట్‌బాల్‌ను ప్రేమిస్తుంది’ అని మమతా బెనర్జీ అన్నారు. మమతా బెనర్జీ వెంట గోవా మాజీ ముఖ్యమంత్రి లూయిజిన్హో ఫలేరో, టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్, స్థానిక నేతలు ఉన్నారు.
Also read: కేటీఆర్ సార్! మీరు గైడ్ చేస్తారని ఆశిస్తున్నా.. వైరల్ అవుతున్న యాంకర్ అనసూయ ట్వీట్..
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్న మమతా బెనర్జీ.. జాతీయ స్థాయిలో టీఎంసీ ముద్ర వేసేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె గోవాలో పర్యటిస్తున్నారు. తన పర్యనటలో భాగంగా శనివారం మమతా బెనర్జీ విలేఖరుల సమావేశాన్ని నిర్వహించనున్నారు. అనంతరం ఓల్డ్ గోవాలోని బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్, మపుసాలోని బోడ్గేశ్వర్ ఆలయాన్ని సందర్శించనున్నారు.