కేజ్రీవాల్ ఇంటి ముందు సిద్దూ ధర్నా.. పరిస్థితి ఉద్రిక్తం
వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్ని ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఆప్ నేతలు పంజాబ్‌లో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. అధికార కాంగ్రెస్ సైతం ఇతర పార్టీలను ఇరుకున పెట్టే విధంగా ఆరోపణలు, విమర్శలతో ముందుకు సాగుతోంది. ఆదివారం కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ... కేజ్రీవాల్ ఇంటిమందు ఆందోళను దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
2022 ప్రారంభంలో ఐదు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్‌లలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక పంజాబ్‌లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. రాజకీయ పార్టీలన్ని నువ్వానేనా అనే విధంగా విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అలాగే, కొత్త కొత్త పథకాలు, హామీలతో ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలను పెంచాయి. అలాగే, ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెడుతూ... తమకు అనుకూల పరిస్థితులను కల్పించుకుంటున్నాయి. ఇక Punjab లో ప్రతిపక్ష పార్టీ ఆప్, అధికార పార్టీ కాంగ్రెస్ మధ్య పోరు ముదురుతోంది.
Also Read: విదేశీ కంపెనీల చేత్తుల్లోకి తెలంగాణ భూ వివరాలు.. రాములమ్మ సంచలన వ్యాఖ్యలు
ఎలాగైనా Punjab అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేయాలని ఆప్ (AAP) భావిస్తోంది. దీనికి అనుగుణంగానే ఆప్ అగ్రనేతలందరూ ఎన్నికల ప్రచారం కోసం పంజాబ్ వెళ్తున్నారు. పంజాబ్ ఎన్నికల్లో విజయం సాధించి దేశవ్యాప్తంగా విస్తరించాలనే కాంక్షతో ఆప్ ముందుకు కదులుతున్నదని తెలుస్తుంది. అయితే, గత ఎన్నికల్లో ఆప్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ.. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిముందు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తతకు దారితీసింది. guest teachersను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్‌తో ఉపాధ్యాయులు ధర్నకు దిగారు. ఈ ధర్నాలో నవజ్యోత్ సింగ్ సిద్దూ పాల్గొన్నారు. ఉపాధ్యాయులతో కలిసి ఆయన ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో ఆప్ తన విజయంలో కీలకంగా భావిస్తున్న విద్యా నమునాను లక్ష్యంగా చేసుకుని సిద్దు విమర్శలు గుప్పించారు.
Also Read: ఆ ఐదు రాష్ట్రాల్లో మహిళలపైనే రాజకీయ పార్టీల నజర్ ఎందుకు?
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వ ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్ "కాంట్రాక్ట్ మోడల్" అంటూ విమర్శించారు. అలాగే, AAP ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం పెరిగిందన్నారు. గత ఐదేండ్లలో ఢిల్లీలో నిరుద్యోగ రేటు దాదాపు 5 రెట్లు పెరిగిందని ఆరోపించారు. ట్విట్టర్‌లో ఆందోళనకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ.. ఢిల్లీలోని guest teachersను "బాండెడ్ లేబర్"గా పరిగణిస్తున్నారని అన్నారు. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ఆప్ ప్రకటించిన మేనిఫెస్టోలో ఢిల్లీలో కొత్తగా 8 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. అలాగే, 20 కొత్త కాలేజీలు కట్టిస్తామని తెలిపారు. మరీ ఆ ఉద్యోగాలు, కాలేజీలు ఎక్కడున్నాయి? అని సిద్దూ ప్రశ్నించారు. ఢిల్లీలో కేవలం 440 ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. హామీలను నెరవేర్చడంలో ఆప్ విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ పాలన వైఫల్యంతో ఐదేండ్లలో దాదాపు 5 రెట్లు నిరుద్యోగం పెరిగిందన్నారు.
Also Read: సింగరేణి కాలనీ తరహాలో మరో ఘటన.. ట్రంకుపెట్టెలో ఆరేళ్ల చిన్నారి..
అలాగే, ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్ ఒక కాంట్రాక్ట్ మోడల్ అని విమర్శించారు. ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న 1031 పాఠశాలలు ఉండగా, వాటిలో 196 పాఠశాలల్లో మాత్రమే ప్రధానోపాధ్యాయులు ఉన్నారని సిద్దూ అన్నారు. అలాగే, 45 శాతం ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 22,000 మంది గెస్ట్ టీచర్లు రోజువారీ వేతనాలతో ప్రతి 15 రోజులకు కాంట్రాక్ట్‌ల పునరుద్ధరణ చర్యలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇదిలావుండగా, పంజాబ్‌లో గత కొన్ని రోజులుగా రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అంతర్గత పోరుతో ఇబ్బందులు పడుతోంది. దీనిని క్యాష్ చేసుకోవడానికి ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఎలాగైనా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గద్దె దించాలని ఆప్ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈ రెండు పార్టీలు రాష్ట్రంలో రాజకీయ హీటును పెంచాయి. దీనికి తోడు ఇటీవలే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీని ఏర్పాటు చేసిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సైతం కొత్త పార్టీని ఏర్పాటు చేసి.. బీజేపీ, శిరోమణి అకాలీదళ్ లతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు.
Also Read: కరోనా పంజా.. ఒక్కరోజే 2,796 మంది మృతి