బిహు వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ అసోంలో పర్యటించనున్నారు.
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారంనాడు అసోంలో జరిగే బిహు వేడుకల్లో పాల్గొంటారు.దేశంలోని పలు ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం నిర్వహిస్తున్న పండుగలు, వేడుకల్లో మోడీ పాల్గొంటున్నారు. నిన్న తమిళనాడు కొత్త సంవత్సర వేడుకల్లో మోడీ పాల్గొన్నారు.
గత వారం ఈస్టర్ సందర్భంగా ఢిల్లీలోని సేక్రేడ్ హార్డ్ కేథడ్రల్ చర్చిని ప్రధాని మోడీ సందర్శించారు. గత మాసంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిర్వహించిన ఉగాది వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో కన్నడ దిమావా సాంస్కృతిక ఉత్సవాన్ని మోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే. 2022 నవంబర్ మాసంలో గురునానక్ జయంతి సందర్భగా గురునానక్ దేవ్ జీ జన్మదిన వేడుకల్లో మోడీ పాల్గొన్నారు.
గత ఏడాది సెప్టెంబర్ మాసంంలో అహ్మదాబాద్ లో నిర్వహించిన నవరాత్రి వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. 2022 ఆగష్టు మాసంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నివాసంలో నిర్వహించిన గణేష్ చతుర్థి వేడుకల్లో మోడీ భాగస్వామయ్యారు.
బుద్దపూర్ణిమను పురస్కరించుకొని గత ఏడాది మే మాసంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన ప్రత్యేక పార్ధనలను పీఎం నిర్వహించారు. గత ఏడాది ఏప్రిల్ మాసంలో ఢిల్లీలో కేంద్ర మంత్రి శర్భానంద సోనేవాల్ నిర్వహించిన బిహు ఉత్సవంలో ప్రధాని పాల్గొన్నారు. వారణాసిలో దీపావళి ఉత్సవంలో ప్రధాని భాగస్వామ్యమయ్యారు.
