Asianet News TeluguAsianet News Telugu

ఏడాదిలోనే కోవిడ్‌కు వ్యాక్సిన్ తెచ్చారు.. శెభాష్: భారతీయ శాస్త్రవేత్తలకు మోడీ ప్రశంసలు

కోవిడ్-19 వ్యాక్సిన్‌ను వేగంగా అభివృద్ధి చేసినందుకు గాను భారత శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఈ మహమ్మారి వచ్చిన తర్వాత కేవలం ఏడాదిలోనే వ్యాక్సిన్‌ను అభివృద్ధిపరచడంతో పాటు దీంతో పోరాడటానికి ఇతర చర్యలను బలోపేతం చేస్తున్నారని మోడీ కొనియాడారు.

narendra modi praises indian scientists for their achivements in developing vaccines ksp
Author
New Delhi, First Published Jun 4, 2021, 2:24 PM IST

కోవిడ్-19 వ్యాక్సిన్‌ను వేగంగా అభివృద్ధి చేసినందుకు గాను భారత శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఈ మహమ్మారి వచ్చిన తర్వాత కేవలం ఏడాదిలోనే వ్యాక్సిన్‌ను అభివృద్ధిపరచడంతో పాటు దీంతో పోరాడటానికి ఇతర చర్యలను బలోపేతం చేస్తున్నారని మోడీ కొనియాడారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) సమావేశంలో శుక్రవారం మోడీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. 

గడచిన శతాబ్దంలో విదేశాల్లో సాధించిన అభివృద్ధిని మన దేశంలో సాధించడం కోసం అనేక సంవత్సరాలు వేచి చూడవలసి వచ్చేదని చెప్పారు. కానీ నేటి భారతీయ శాస్త్రవేత్తలు విదేశీ శాస్త్రవేత్తలతో భుజం భుజం కలిపి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. విదేశీ, స్వదేశీ శాస్త్రవేత్తలు ఒకే వేగంతో పని చేస్తున్నారన్నారని వ్యాఖ్యానించారు. ప్రపంచం ఓ శతాబ్దంలో అతి పెద్ద సవాలును ఎదుర్కొంటోందని, కేవలం ఓ ఏడాదిలోనే వ్యాక్సిన్లను అభివృద్ధిపరచడం గతంలో ఎన్నడూ లేదని ప్రధాని అన్నారు. 

Also Read:పదిరెట్లు పెరిగిన ఆక్సిజన్ ఉత్పత్తి: మన్‌కీ బాత్ లో మోడీ

స్వయం సమృద్ధ భారత్, బలమైన భారత్ కోసం మనమంతా కృషి చేయాలని మోడీ పిలుపునిచ్చారు. కోవిడ్-19 సంక్షోభం వేగం తగ్గి ఉండవచ్చు కానీ, మన దృఢ నిశ్చయం సుస్థిరంగా ఉందని ప్రధాని అన్నారు. సుస్థిర అభివృద్ధి, క్లీన్ ఎనర్జీ రంగాల్లో ప్రపంచానికి భారత్ ఓ మార్గాన్ని చూపుతోందని మోడీ తెలిపారు. ఇతర దేశాలు సాఫ్ట్‌వేర్, శాటిలైట్ డెవలప్‌మెంట్ రంగాల్లో ప్రగతి సాధించడంలో మనం కీలక పాత్ర పోషిస్తున్నామని నరేంద్రమోడీ గుర్తుచేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios