Asianet News TeluguAsianet News Telugu

నరేంద్ర దేశం కోసం చాలా పనిచేస్తున్నారు..కొంచెం విశ్రాంతి తీసుకోవాలి-ఉద్వేగానికి లోనైన ప్రధాని సోదరుడు సోమాభాయ్

ప్రధాని నరేంద్ర మోడీ దేశం కోసం చాలా పని చేస్తున్నారని ఆయన సోదరుడు సోమాభాయ్ మోడీ అన్నారు. మోడీని విశ్రాంతి తీసుకోవాలని తాను కోరానని అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అహ్మదాబాద్ లో ప్రధాని ఓటు వేశారు. 

Narendra is working a lot for the nation..he should take some rest- emotional PM's brother Somabhai
Author
First Published Dec 5, 2022, 3:19 PM IST

ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సోమవారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం సమయంలో ఆయన అహ్మదాబాద్ నగరంలోని రాణిప్ ప్రాంతంలోని నిషాన్ హైస్కూల్‌లో ఉన్న పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. అనంతరం సమీపంలో ఉన్న తన సోదరుడు సోమాభాయ్ మోడీ ఇంటికి నడుచుకుంటూ వెళ్లారు. సోదరుడితో కొంత సమయం గడిపారు.

లూడో గేమ్‌ వ్యసనం.. ఆమెపైనే బెట్ వేసుకుని ఓనర్ చేతిలో ఓడిన మహిళ.. భర్తకు తిప్పలు

ప్రధాని వెళ్లిన అనంతరం సోదరుడు మీడియాతో మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. వాళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణను వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో వెల్లడించారు. ‘ దేశం కోసం ఆయన (మోడీ) చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఆయన కూడా కాస్త విశ్రాంతి తీసుకోవాలని (పీఎం మోదీని) కోరాను’’ అని సోమాభాయ్ అన్నారు. 2014 నుంచి జాతీయ స్థాయిలో జరుగుతున్న పనులను దేశ ప్రజలు విస్మరించలేరని అన్నారు. ‘ఓట్లను సద్వినియోగం చేసుకోవాలన్నదే నేను ఓటర్లకు ఇచ్చే ఏకైక సందేశం. దేశాభివృద్ధికి పాటుపడే ఇలాంటి పార్టీకి ఓటేయాలి. నాటి నుంచి జాతీయ స్థాయిలో ఎలాంటి పనులు జరుగుతున్నాయో ప్రజలు చూశారు. 2014ను నుంచి జరుగుతున్న పనులను అందరూ చూశారు. దాని ఆధారంగానే ప్రజలు ఓట్లు వేస్తారు.’’ అని అన్నారు.

ఉత్తర, మధ్య గుజరాత్‌లోని 14 జిల్లాల్లోని 93 అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండో దశలో నేడు ఓటింగ్ జరుగుతోంది. భారీ బందోబస్తు మధ్య ఈ ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. రెండో విడతలో మొత్తంగా 61 పార్టీల నుంచి 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి భవితవ్యాన్ని 2.51 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు.

ఓటింగ్ కోసం ఎన్నికల సంఘం 26,409 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసింది. దాదాపు 36,000 ఈవీఎంలను వినియోగిస్తోంది. ఎన్నికలను సులభతరం చేసేందుకు 14 జిల్లాల్లో దాదాపు 29,000 మంది ప్రిసైడింగ్, 84,000 మంది పోలింగ్ అధికారులను మోహరించారు. గుజరాత్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పి భారతి వెల్లడించిన వివరాల ప్రకారం.. మొత్తం 26,409 పోలింగ్ స్టేషన్లలో, 93 మోడల్ పోలింగ్ బూత్‌లు, 93 ఎకో ఫ్రెండ్లీ బూత్‌లు ఏర్పాటు చేశారు. 93 పోలింగ్ బూత్ లు పూర్తిగా దివ్యాంగులు నిర్వహిస్తుండగా.. మరో 14 యువత నిర్వహిస్తోంది. రెండో విడతలో 13,319 పోలింగ్ బూత్‌లలో వెబ్‌కాస్టింగ్ చేయనున్నారు.

రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర'ను మీడియా బహిష్కరిస్తోంది: అశోక్ గెహ్లాట్

మొత్తం 2,51,58,730 మంది ఓటర్లు ఓటు వేయనుండగా వారిలో 1,29,26,501 మంది పురుషులు, 1,22,31,335 మంది మహిళలు, 894 మంది థర్డ్ జెండర్‌లు ఉన్నారు. అహ్మదాబాద్, గాంధీనగర్, మెహసానా, పటాన్, బనస్కాంత, సబర్‌కాంత, ఆరావళి, మహిసాగర్, పంచమహల్, దాహోద్, వడోదర, ఆనంద్, ఖేడా మరియు ఛోటా ఉదయ్‌పూర్ జిల్లాల్లో 93 స్థానాలు రెండో దశలో ఉన్నాయి. గుజరాత్‌లో చివరి దశలో ఓట్లు వేయనున్న ప్రముఖులలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఇసుదాన్ గాధ్వి, గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీష్ ఠాకోర్, క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా ఉన్నారు.

ఓరి నాయనో.. చూస్తుండగానే కుప్పకూలిన 4 అంతస్థుల భవనం.. ఢిల్లీలో ఘటన (వీడియో)

డిసెంబర్ 1న జరిగిన తొలి దశ పోలింగ్‌లో గుజరాత్‌లో మొత్తం 63.14 శాతం పోలింగ్ నమోదైంది. కచ్, సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లోని 19 జిల్లాల్లోని 89 నియోజకవర్గాల్లో ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రారంభమై ప్రశాంతంగా ముగిసింది. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios