ఢిల్లీలో ఓ నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు. పట్టణంలోని శాస్త్రినగర్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

ఢిల్లీలో ఓ భవనం అందరూ చూస్తుండగానే ఒక్క సారిగా కుప్పకూలిపోయింది. ఉత్తర ఢిల్లీలోని శాస్త్రి నగర్‌ ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.

గుజరాత్ ప్రజలు అందరి మాట వింటారు.. కానీ నిజాన్నే అంగీకరిస్తారు - ప్రధాని నరేంద్ర మోడీ

అయితే అదృష్టవశాత్తూ ఆ ఇళ్లు ఆ సమయంలో ఖాళీగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు. ఆ భవనం కూలిన ప్రదేశంలో ఓ రోడ్డు ఉంది. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ కూడా ఎవరూ లేరు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఇందులో భవనం కుప్పకూలిన తీరు స్పష్టంగా కనిపిస్తోంది. 

Scroll to load tweet…

భవనం కూలిన సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక శాఖ, అంబులెన్స్‌లను సంఘటనా స్థలానికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Scroll to load tweet…