ఢిల్లీ డెత్ మిస్టరీ: మరణానికి ముందు కసరత్తు ఇదే

mystery behind burari deaths
Highlights

ఢిల్లీ డెత్ మిస్టరీ: మరణానికి ముందు కసరత్తు ఇదే

యావత్ దేశాన్ని విషాదంలోకి నెట్టిన ఢిల్లీ సామూహిక మరణాల కేసులో తవ్వేకొద్దీ అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆధారాల కోసం అన్వేషిస్తునన పోలీసులకు వారి ఇంట్లో ఓ డైరీతో పాటు కొన్ని కీలక పత్రాలు లభించాయి. ఆ పత్రాలను పరిశీలించగా వారంతా 2015 నుంచే కలిసే చనిపోయేందుకు ప్రణాళికలు రచించినట్లు తెలుస్తుంది. మోక్షం పొందడం కోసం.. కుటుంబసభ్యులంతా ఎలా బలవన్మరణానికి పాల్పడాలో వాటిలో స్పష్టంగా రాసుంది. తాము మరణించబోయే రోజును కూడా వారు ఆ పత్రాల్లో పొందుపరిచారు.. అందుకు తగ్గట్టుగానే భవనాన్ని నిర్మించేటప్పుడే పెట్టిన 11 పైపులను  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో నాలుగు పైపులు పెద్దవిగా.. మిగతావి చిన్నగా ఉండటంతో.. ఆ నాలుగు పైపులు మగవాళ్లను.. మిగతావి మహిళలను సూచించడానికి పెట్టారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.. ఒకపైపు దూరంగా పెట్టి ఉంచడాన్ని బట్టి చూస్తుంటే.. అది వృద్ధురాలు నారాయణ దేవి కోసమేనా అన్న  అనుమానాలు కలుగుతున్నాయి. ఇక వీరిలో ఏ ఒక్కరూ మరణాన్ని నమ్మడం లేదు.. తమను దేవుడు కాపాడతాడని..బలంగా నమ్ముతున్నారు. ఇక మొత్తం తతంగానికి నారాయణ దేవి చిన్న కొడుకు లలిత్ భాటియా సూత్రధారిగా తెలుస్తుంది.. అందరూ మరణించిన తర్వాతే అతడే చివరిగా ఆత్మహత్యకు పాల్పడ్డాడని సమాచారం. 

పోలీసులకు దొరికిన పత్రాల్లోని వివరాల ప్రకారం:
* కొందరు వ్యక్తులు వారి శరీరాన్ని వస్త్రాలతోనూ.. తాడుతోనూ కట్టినట్లు తెలుస్తుంది.
* మృతదేహాలు వేలాడుతున్న స్థితికి.. పత్రాల్లో రాసున్న విధానం సరిపోలడంతో ఎవరో వీరి చేతులను, నోటీని వెనుక నుంచి కట్టారని స్పష్టమవుతోంది.
* నారాయణ దేవి రాసినట్లుగా చెప్పబడుతున్న డైరీని ఆ పక్కగా కండువా, బెల్ట్‌ను కనుగొన్నారు. దీని ప్రకారం ఆ కండువాతో ఆమె ముక్కును మూసి ఉంచారని పోలీసులు అనుమానిస్తున్నారు.
* చనిపోయే రోజు రాత్రి ఈ కుటుంబం  20 రొట్టెలను ఆర్డర్ చేసింది. 10.40 ప్రాంతంలో డెలీవరి అందినట్లు పోలీసులు నిర్థారించారు. ఈ రొట్టెలను నారాయణ దేవి తన చేత్తో కుటుంబసభ్యులకు తినిపించింది. 
* చనిపోవడానికి  ముందు 10 ఏళ్ల ముందు మరణించిన తన తండ్రి గోపాల్ దాస్ గురించి లలిత్ భాటియా తీవ్రంగా బాధపడ్డాడు.
* నేను రేపు లేదా ఆ మరుసటి రోజు తప్పకుండా తిరిగివస్తాను.. ఒకవేళ రానిపక్షంలో లలిత్  గురించి చింతించకండి.
* ఈ కుటుంబం స్వామిజీలను బాగా నమ్మేదని స్ధానికులు చెబుతున్న దానిని బట్టి.. ఎవరైనా బాబా వీరి వెనుక ఉన్నాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. దీనికి తోడు మెయిన్ డోర్ తెరిచి ఉండటం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.
* ఈ మొత్తం తతంగానికి సూత్రధారిగా భావిస్తోన్న లలిత్ కొన్నిరోజులుగా ఎవరితో మాట్లాడటం లేదని తెలుస్తోంది. అయితే ఇటీవలికాలంలో చనిపోయిన తన తండ్రి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడని కొందరు స్థానికులు చెబుతున్నారు. 
* ఈ ప్రపంచం అంతమైపోయే రోజు నేను తప్పకుండా వచ్చి కుటుంబాన్ని రక్షిస్తాను.. ఈ చివరి గడియాల్లో మీ కోరిక తప్పకుండా  తీరుతుంది.. ఆకాశద్వారాలు మీకోసం తెరుచుకోబడతాయి.. ఆ ప్రకంపలు ధాటికి భూమి కంపిస్తుంది.. ఆ సమయంలో మంత్రాలు బిగ్గరగా చదవండి.. నేను తప్పకవచ్చి మీతో పాటు ఇతరులను కాపాడతాను అని రాసుంది. 
* తండ్రి చనిపోతూ తన తర్వాత లలిత్ కుటుంబానికి దారి చూపుతాడని.. అందరూ అతను చెప్పినట్లు నడవాలని సూచించినట్లు తెలుస్తోంది. 
* మూఢనమ్మకాలను.. ఆధ్యాత్మికభావాలను బాగా వంటబెట్టించుకున్న ఈ కుటుంబం.. ఏదో ఒక రోజు ప్రళయం ముంచుకు వస్తుందని గట్టిగా  నమ్మింది. 
* లలిత్ భాటియా తన భావాలను ఎక్కువగా డైరీలోనే రాసుకునేవాడని.. చివరికి ఆ రోజు ఖాతాదారులతో జరిపిన వ్యవహారాలను కూడా రాసుకునేవాడని సన్నిహితులు చెబుతున్నారు.

loader