మైసూరులో కలకలం రేపిన హిందీ టీచర్ సులోచన హత్య కేసులో మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం కారణంతో గాయత్రి అనే మహిళ హత్య చేసినట్లు తేలింది.
మైసూరు : ఆరు నెలల కిందట మైసూరు జిల్లాలోని నంజనగూడు పట్టణంలో జరిగిన వసతి పాఠశాల ఉపాధ్యాయురాలు హత్య కేసు మిస్టరీ విడిపోయింది. నంజనగూడు నగరసభ సభ్యురాలితో పాటు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక మొరార్జీ దేశాయ్ వసతి పాఠశాల హిందీ టీచర్ సులోచన మార్చి నెల 9వ తేదీన దారుణ హత్యకు గురైంది. అప్పటి నుంచి హంతకులు ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు నగర సభ్యురాలు గాయత్రి మురగేశ్, ఆమె బంధువు భాగ్య, నాగమ్మ, కుమార్ లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణం అని తెలిసింది.
భర్త తో క్లోజ్ గా ఉందని…
సులోచన భర్త 4 సంవత్సరాల క్రితం మృతి చెందాడు. గాయత్రి భర్త మురుగేష్ శ్రీకంఠేశ్వరస్వామి దేవాలయంలో డి గ్రూపు ఉద్యోగిగా పని చేస్తుంటాడు. ఇతనికి, టీచర్ కు మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. ఇద్దరు కలిసి ఉండటం అనేకసార్లు గాయత్రి గమనించింది. దీంతో కసితో రగిలిపోయింది. తన భర్తను కలవద్దని గాయత్రి టీచర్ ను హెచ్చరించినా.. ఆమె తీరు మారలేదు. దీంతో శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. నంజనగూడులోనే అద్దె ఇంట్లో సులోచన ఉండేది. మరో ముగ్గురు సహకారంతో సులోచన ఇంటికి వెళ్లిన గాయత్రి.. ఆమెను గొంతు పిసికి హత్య చేసింది. ఈ మేరకు గాయత్రి ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. సులోచనకు ఒక కూతురు, బెంగళూరులో ఉద్యోగం చేసే కొడుకు ఉన్నారు.
సంజయ్ రౌత్‌కు మరో షాక్.. ఆయన భార్య వర్షా రౌత్‌కు ఈడీ సమన్లు..
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ భర్త అతికిరాతకంగా భార్యను హత్య చేసి పంట కాలువలో పడేశాడు. వివాహేతర సంబంధం అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడడం.. స్థానికంగా కలకలం రేపింది. నిడమర్రు ఎస్ఐ కే గురవయ్య, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమర్రు గ్రామానికి చెందిన వీరన్న, రమ్య (26)కు ఆరేళ్ల కిందట వివాహమయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరన్న వ్యాన్ నడుపుతుంటాడు. రమ్య కూలీ పనులు చేస్తుంది. అలా వారు సంసారాన్ని నెట్టుకొస్తున్నారు.
ఈ క్రమంలో వీరన్నకు తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం కలిగింది. ఈ విషయం మీద గత నెల 31వ తేదీ రాత్రి వారిద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ చిలికి చిలికి గాలివానగా మారడంతో.. కోపం పట్టలేని వీరన్న భార్యను పీక పిసికి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో మృత దేహాన్ని తన వ్యాన్లోకి ఎక్కించి, నిడమర్రు కాలనీ సమీపంలో ఉన్న వంతెన వద్దకు తీసుకువెళ్ళాడు. అక్కడ వ్యాను ఆపుకుని మృతదేహాన్ని పై నుంచి కాల్వలోకి విసిరేశాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయాడు.
అనుకున్నపని సజావుగా అయిపోవడంతో.. ఏమీ తెలియనట్టు నాటకం మొదలుపెట్టాడు. తన భార్య కనిపించడం లేదని చెప్పి బంధుమిత్రులతో కలిసి చుట్టుపక్కలా గాలించాడు. అంతేకాదు ఈ మేరకు నిడమర్రు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాడు. దీంతో వారు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే వీరన్నపైనే అనుమానం ఉందని రమ్య తల్లి సత్యవతి ఫిర్యాదు చేయడంతో కేసు మరో మలుపు తిరిగింది. పోలీసులు ఆ దిశగా విచారించగా.. వీరన్నే నేరం చేశాడని తేలింది. నేరాన్ని అంగీకరించిన వీరన్న.. భార్య మృతదేహం ఎక్కడ పడేసిందీ ఆచూకీ తెలిపాడు. పోలీసులు గురువారం కాలువలో గాలించగా తూడులో చిక్కుకుని కుళ్లిపోయి ఉన్న రమ్య మృతదేహం లభించింది. వీరన్నపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించనున్నట్లు ఎస్సై తెలిపారు.
