మునుగోడు ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అయితే కాంగ్రెస్ తరుఫున పని చేస్తున్న సునీల్ కానుగోలు, ప్రశాంత్ కిషోర్ బృందం ఎదుర్కొంటున్న మొదటి ఎన్నికలు ఇవి. దీంతో వారు కూడా ఈ ఎన్నికలను ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నారు.  

మునుగోడు ఉప ఎన్నిక‌కు అన్ని ప్ర‌ధాన పార్టీలు సిద్ధం అవుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తమ వ్యూహాల‌తో ఈ ఎన్నిక‌ల్లో గెల‌వాల‌ని ప్లాన్ చేసుకుంటున్నాయి. ఈ ఎన్నిక‌ను టీఆర్ఎస్ సాధారణ ఎన్నిక‌లకు ముందు ‘సెమీ ఫైనల్’ భావిస్తుంటే.. అధికార పార్టీకి తామే ప్ర‌త్యామ్నాయం అని చాటి చెప్పాల‌ని కాంగ్రెస్ , బీజేపీలు భావిస్తున్నాయి. అయితే ఈ ఉప ఎన్నిక‌లు రాజ‌కీయ పార్టీల‌కే కాదు.. ప్ర‌శాంత్ కిషోర్ నేతృత్వంలోని I-PAC, సునీల్ కానుగోలు నేతృత్వం లోని బృందానికి ఇది అగ్ని పరీక్ష వంటిదే. 

పురుట్లోనే భార్య మృతి, తట్టుకోలేక భర్త ఆత్మహత్య...అనాథగా చిన్నారి...

ఈ రెండు పోల్ కన్సల్టెన్సీలు టీఆర్ఎస్, కాంగ్రెస్ కు ప‌ని చేయ‌డం ప్రారంభించిన తర్వాత వ‌చ్చిన మొద‌టి ఉప ఎన్నిక ఇది. పేకే ఆధ్వ‌ర్యంలోని ఐ-ప్యాక్, సునీల్ కానుగోలుల బృందం ఎదుర్కొంటున్నది ఈ మునుగోడు ఉప ఎన్నికే కావ‌డం ఆస‌క్తిక‌ర‌మైన అంశం. పీకే నేరుగా టీఆర్ఎస్ కు పని చేయ‌న‌ప్పటికీ ఆయ‌న ప‌లు సంద‌ర్భాల్లో టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ను క‌లిశారు. ప్రగతి భవన్ తో పాటు ఎర్రవెల్లిలోని రెండో ఫామ్ హౌస్ లో కూడా బ‌స చేశారు. టీఆర్ఎస్ కు ఎన్నిక‌ల వ్యూహాలు రచించడంలో ఆయన పాత్ర ఉంటుంద‌ని తోసిపుచ్చ‌లేని అంశం. 

మునుగోడు బైపోల్ 2022 : టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు కోరిన కేసీఆర్.. నేడు అధికారికంగా ప్రకటన..

మునుగోడులో ఉప ఎన్నిక కోసం బీజేపీ ఈ నెల 21వ తేదీన (ఆదివారం) భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించాల‌ని బీజేపీ భావిస్తోంది. ఈ స‌మావేశానికి ఆ పార్టీ సీనియ‌ర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజ‌ర‌వ‌నున్నారు. అయితే ఆ స‌భ కంటే ఒక రోజు ముందే (నేడు) స‌భ నిర్వ‌హించాల‌ని పీకే బృందం సూచించినట్లు సమాచారం.

‘‘ ఆగస్టు 21న మునుగోడులో జరిగే బ‌హిరంగ స‌భలో అమిత్ షా స‌మ‌క్షంలో బీజేపీలో చేరతానని కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి ఢిల్లీలో ప్రకటించారు. అయితే ఆ స‌మ‌యంలోనే అధికార టీఆర్ఎస్ బీజేపీకి వ్య‌తిరేకంగా తన బహిరంగ సభను తర్వాతి తేదీలో నిర్వహిస్తుంద‌ని అనుకున్నాం అందులో టీఆర్ఎస్ పై అమిత్ షా చేసే వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇస్తార‌ని భావించాం. కానీ అమిత్ షా ప్రసంగానికి ఒక రోజు ముందే కేసీఆర్ బహిరంగ సభను నిర్వ హించాలని నిర్ణయించ‌డం పెద్ద నిర్ణ‌యం. దాని వెనుక చాలా ప్లానింగ్ జ‌రిగింది. కేసీఆర్ స్వయంగా వ్యూహకర్త అయినప్పటికీ ఐ- ప్యాక్ ప్రమేయం లేకుండా ఇది సాధ్యం కాదు ’’ అని టీఆర్ఎస్ నేత ఒకరు చెప్పార‌ని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదించింది. 

హైదరాబాద్ లో విషాదం.. ఆల్కహాల్ సంపులో పడి బాలుడి మృతి...

కాగా.. కాంగ్రెస్ కోసం సునీల్ కానుగోలు, ఆయ‌న టీం మునుగోడు ఎన్నికల ప్రచారం, క్షేత్రంలో పాల్గొంటోంది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ప్ర‌చారం చేస్తున్నారు. దీంతో పాటు క్షేత్ర స్థాయిలో సర్వేలు కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ ను గెలిపించ‌డానికి ఆ టీమ్ విశేషంగా కృషి చేస్తోంది.