నిమ‌జ్జ‌న వేడుక‌ల్లో బాంబుల‌తో దాడి చేస్తామంటూ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు ఓ బెదిరింపు సందేశం వ‌చ్చింది. ఇంత‌కీ ఆ న‌గ‌రం ఏంటి.? ఎలాంటి బెదిరింపుల‌కు దిగారంటే. 

ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు శుక్రవారం ఓ బాంబు బెదిరింపు సందేశం వచ్చింది. ఈ మెసేజ్‌ "లష్కరే-జిహాదీ" అనే ఉగ్రవాద సంస్థ పేరుతో పంపించారు. నగరంలో 34 వాహనాల్లో 34 హ్యూమన్ బాంబులు పెట్టారని, 400 కిలోల RDXతో భారీ పేలుళ్లు జ‌ర‌గ‌నున్నాయంటూ స‌ద‌రు సందేశంలో పేర్కొన్నారు.

14 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించారని కూడా ఆ సందేశంలో ఉంది. ఈ దాడులు గణేశ్ నిమజ్జన సందర్భంగా జరుగుతాయని మెసేజ్‌లో రాసి ఉంది.

పోలీసులు ఏమంటున్నారు?

ముంబై ట్రాఫిక్ పోలీసుల అధికారిక వాట్సాప్ నంబర్‌కి ఈ మెసేజ్ వచ్చింది. సందేశం ఎంతవరకు నిజమో అన్న దానిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మెసేజ్ పంపినవారు పాకిస్తాన్‌ ఆధారిత ఉగ్రవాద సంస్థకు చెందినవారని పేర్కొనడంతో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.