మీ ఇంట్లో కరెంట్ సమస్య ఉందా.? వాట్సాప్‌లోనే ఫిర్యాదు చేయొచ్చు. ఎలాగంటే
TGNPDCL: విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఎదురుకావడం సర్వసాధారణమైన విషయం. అయితే ఇలాంటి సమస్యలు వస్తే సాధారణంగా ఇప్పటి వరకు యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలిసిందే. కానీ తాజాగా ఈ సేవలను మరింత సులభతరం చేసింది.

వాట్సాప్ ద్వారా టీజీఎన్పీడీసీఎల్ సేవలు
తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (టీజీఎన్పీడీసీఎల్) వినియోగదారులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఇప్పటికే మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తులు, ఫిర్యాదుల స్వీకరణ, ఇతర సర్వీసులు అందిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు WhatsApp చాట్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరించడాన్ని ప్రారంభించింది.
KNOW
ఫిర్యాదు నమోదు చేసే విధానం
* వినియోగదారులు తమ మొబైల్‌లోని WhatsApp ద్వారా 79016 28348 నంబర్‌కి "హాయ్" అని పంపాలి.
* వెంటనే "Welcome to TGNPDCL Call Center" అనే మెసేజ్ వస్తుంది.
* మొదట భాష సెలక్ట్ చేసుకోవాలి (తెలుగు లేదా ఆంగ్లం).
* తర్వాత WhatsApp స్క్రీన్‌పై Register Complaint, Track Complaint, Chat with Agent అనే ఆప్షన్లు వస్తాయి.
* అనంతరం Service Number నమోదు చేస్తే ఖాతా వివరాలు కనిపిస్తాయి.
* సమస్యకు సంబంధించిన విభాగాన్ని ఎంచుకొని ఫిర్యాదు నమోదు చేయవచ్చు. అవసరమైతే నేరుగా ఏజెంట్‌తో చాట్ చేసే సౌకర్యం కూడా ఉంటుంది.
వెంటనే కంప్లైట్ ఐడీ
ఫిర్యాదు పూర్తయ్యాక వెంటనే ఒక Complaint ID సృష్టించి వినియోగదారునికి SMS వస్తుంది. అదే సమయంలో ఆ ఫిర్యాదు సంబంధిత అధికారికి పంపిస్తారు. ఈ Complaint ID ద్వారా వినియోగదారు ఎప్పుడైనా సమస్య పరిష్కారం ఎంతవరకు జరిగిందో తెలుసుకోవచ్చు.
సమస్య పరిష్కారం, ఫీడ్‌బ్యాక్ సదుపాయం
సమస్య పరిష్కరించిన తర్వాత టీజీఎన్పీడీసీఎల్ IVRS కాల్ ద్వారా ధృవీకరిస్తుంది. అలాగే వినియోగదారు నుంచి ఫీడ్‌బ్యాక్ కూడా అడుగుతుంది. ఈ విధంగా ఫిర్యాదులు కేవలం నమోదు అవడమే కాకుండా వాటి పరిష్కారం నిజంగా జరిగిందా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తారు.
అధికార వెబ్‌సైట్‌లో కూడా
WhatsApp ఫిర్యాదు సేవతో పాటు, టీజీఎన్పీడీసీఎల్ అధికారిక వెబ్‌సైట్ లో కూడా WhatsApp ఐకాన్‌ను ఉంచారు. వినియోగదారులు దానిపై క్లిక్ చేసి నేరుగా చాట్ ప్రారంభించవచ్చు. ఇప్పటికే అందుబాటులో ఉన్న 1912 టోల్‌ఫ్రీ నంబర్ సదుపాయం కూడా కొనసాగుతుంది.