Asianet News TeluguAsianet News Telugu

క్వీన్ ఎలిజ‌బెత్ మృతికి సంతాపం తెలిపిన ముంబై డ‌బ్బావాలాలు..

బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరణం పట్ల ముంబై డబ్బా వాలాలు సంతాపం వ్యక్తం చేశారు. ఆమెతో ఉన్న అనుభంధాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. 

Mumbai dabbawallas mourn the death of Queen Elizabeth.
Author
First Published Sep 9, 2022, 12:52 PM IST

బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ గురువారం త‌న 92 ఏళ్ల వ‌య‌స్సులో గురువారం మృతి చెందారు. ఆమె మృతి ప‌ట్ల అనేక రంగాల ప్ర‌ముఖుల నుంచి సంతాపం వ్య‌క్తం అవుతోంది. మ‌హారాష్ట్ర ముంబైలోని డ‌బ్బా వాలాల‌కు ఆమె మృతి ప‌ట్ల విచారం వ్య‌క్తం చేశారు. సంతాపం తెలిపారు. ముంబై డ‌బ్బాల వాలాల‌కు, క్వీన్ ఎలిజ‌బెత్ కు అనుబంధం ఉంది. ఈ సంద‌ర్భంగా వారు దానిని గుర్తు చేసుకున్నారు.

ఖండాత‌రాలు దాటిన ప్రేమ‌.. ఒక్క‌టైన త‌మిళ‌నాడు అబ్బాయి.. యూర‌ప్ అమ్మాయి

క్వీన్ ఎలిజ‌బెత్ మ‌ర‌ణ వార్త విన‌గానే రాజ‌కుటుంబం, ప్రపంచం, రాజ‌కుటుంబంతో పాటు తాము కూడా విచారంలో మునిగిపోయామ‌ని ముంబైకి డ‌బ్బావాలాలు శుక్ర‌వారం తెలిపారు. నూతన్ ముంబై టిఫిన్ బాక్స్ సప్లయర్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్ రఘునాథ్ మెడ్జే మాట్లాడుతూ.. ‘‘ ముంబైలోని డబ్బావాలాలందరి తరపున రాజకుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.’’ అని అన్నారు. డబ్బావాలాలు గతంలో ఎక్కువగా ప్రపంచానికి తెలియరని, అయితే క్వీన్ ఎలిజబెత్, రాజకుటుంబం కారణంగా ఫేమస్ అయ్యారని ఆయన చెప్పారు. 

రాయల్ వెడ్డింగ్ కోసం లండన్‌కు తన ఎనిమిది రోజుల పర్యటనను గుర్తుచేసుకుంటూ.. విండ్సర్ కాజిల్‌లో క్వీన్ ఎలిజబెత్, ఇతర రాజకుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం తీసుకున్నామని మెడ్జే చెప్పారు. ఏప్రిల్ 2005లో ప్రిన్స్ చార్లెస్, కెమిల్లా పార్కర్-బౌల్స్ రాజ వివాహానికి మెడ్జేతో పాటు మరో అసోసియేషన్ ఆఫీస్ బేరర్ సోపాన్ మేర్ హాజరయ్యారు. ‘‘ మేము రాజ కుటుంబంతో కలిసి విండ్సర్ కాజిల్‌లో రెండుసార్లు అల్పాహారం తీసుకున్నాము. మాతో పాటు రాణి కూడా అక్కడ ఉన్నారు ’’ అని ఆయన చెప్పారు.

ఐడీ కార్డులు లేకుండా గర్భా పండాల్లోకి అనుమ‌తించ‌బోం: ఉషా ఠాకూర్ వివాదాస్ప‌ద నిర్ణ‌యం

భాషాపరమైన అవరోధం కారణంగా ఆమెతో మాట్లాడే అవకాశం తమకు రాలేదని మెడ్జే అన్నారు. కానీ రాణి తమతో చాలా మర్యాదగా వ్యవహరించారని ఆయన గుర్తు చేసుకున్నారు. 2008 సంవత్సరం నవంబర్ లో ముంబైపై పాక్ ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు క్వీన్ ఎలిజబెత్ తమ గురించి ఆరా తీసిందని మెడ్జే తెలిపారు. 

కాగా.. ప్రపంచ వ్యాప్తంగా ఫేమ‌స్ అయిన డబ్బావాలాలు లంచ్ బాక్స్ డెలివరీ చేస్తారు. ఆఫీసు కు టిఫిన్ బాక్సులు తీసుకెళ్ల‌లేని వారికి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతోంది. ఉద్యోగ‌స్తుల ఇళ్ల నుంచి, లేదా రెస్టారెంట్ల నుంచి టిఫిన్ బాక్సులు తీసుకొచ్చి ఉద్యోగ‌స్తుల‌కు వేడి భోజ‌నం అంద‌జేస్తారు. ఈ డ‌బ్బా వాలాల సిస్ట‌మ్ చాలా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. 

రాజస్థాన్ లో బాల్యవివాహం.. ఏడాది వయసు బాలికకుపెళ్లి.. 20 యేళ్ల తరువాత రద్దు చేసిన కోర్టు..

ఇదిలా ఉండ‌గా.. క్వీన్ ఎలిజ‌బెత్ మ‌ర‌ణం ప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కూడా విచారం వ్య‌క్తం చేశారు. బ్రిటీష్ రాణిని కలిసిన రోజుల‌ను గుర్తు చేసుకుంటూ, ఆమెను క‌లిసిన ఫొటోల‌ను ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు. నేను 2015, 2018లో యూకే పర్యటన సందర్భంగా క్వీన్ ఎలిజబెత్ IIతో నేను చిరస్మరణీయమైన సమావేశాల్లో పాల్గొన్నాను. ఆమె ఆప్యాయత, దయ నేను ఎప్పటికీ మరచిపోలేను. ఒక సమావేశంలో మహాత్మా గాంధీ ఆమెకు పెళ్లిలో బహుమతిగా ఇచ్చిన రుమాలును నాకు చూపించారు. ఆమె చూపిన ఆప్యాయ‌త‌ను నేను ఎప్పుడూ ఆదరిస్తాను.’’ అని ప్రధాని ట్వీట్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios