Asianet News TeluguAsianet News Telugu

ఖండాత‌రాలు దాటిన ప్రేమ‌.. ఒక్క‌టైన త‌మిళ‌నాడు అబ్బాయి.. యూర‌ప్ అమ్మాయి

ఖండంతరాలు దాటిన ప్రేమకు పెద్దల సమ్మ‌తి తోడైంది.. ఇంకేముంది హిందూ సంప్రదాయం ప్ర‌కారం.. ఆ ప్రేమ జంట మూడు ముళ్ల బందంతో ఒక్కటైంది. యూర‌ప్ అమ్మాయి, త‌మిళ‌నాడు అబ్బాయి ప్రేమపెళ్లి ఇరువురి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.  

Tamil Nadu man marries  europe girl in 'traditional' wedding in Chennai
Author
First Published Sep 9, 2022, 12:12 PM IST

ప్రేమకు కులం, మతం, ప్రాంతం అనే తేడాలు ఉండవు. ఒక్క‌సారి పరిచయం చిగురిస్తే చాలు..  స్నేహితులుగా మారుతారు. ఇద్ద‌రి మ‌ధ్య అభిప్రాయాలు క‌లిస్తే..స్నేహాం కాస్తా ప్రేమగా మారుతుంది. ఆ ప్రేమికులు ఖండంత‌రాల్లో ఉన్నఒకరి కోసం ఒకరు అనేంతగా దగ్గరవువుతుంటారు. తమ నిజ‌మైన  ప్రేమను పెళ్లి పీటలెక్కించి.. ముళ్ల బంధంతో ఒక్క‌టవుతారు. త‌మ ప్రేమ‌ క‌థ‌కు శుభంకార్డు వేసుకుంటారు. ఇలా.. త‌మ ప్రేమకు హద్దులు లేవ‌నీ, ఖండాంతరాలు కూడా లేవ‌ని నిరూపించారు త‌మిళ‌నాడు అబ్బాయి.. యూర‌ప్ అమ్మాయి. పెద్దలను ఒప్పించి.. వారి సమక్షంలోనే.. హిందూ వివాహ సంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకుని కొత్త జీవితం ప్రారంభించారు. వీరి పెళ్లి వేడుకకు రాజకీయ ప్రముఖులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై.. ఆ న‌వ‌దంప‌తుల‌ను  ఆశీర్వాదించారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. త‌మిళ‌నాడు మదురై జిల్లా తిరుమంగళం  ప్రాంతానికి చెందిన కాళిదాసు (30) ఓ మ‌ల్టీ నేష‌నల్ కంపెనీలో సాప్ట్ వేర్ గా పనిచేస్తున్నారు. గ‌తంలో విదేశాల్లో ప‌నిచేసినా  కరోనా కారణంగా సొంత ఊళ్లోనే ఉంటూ..అన్లైన్లో పని చేస్తున్నారు. గ‌త రేండేండ్ల కిత్రం అత‌నికి యూరప్ కి చెందిన హానా బొమిక్లోవా అనే అమ్మాయితో ప‌రిచ‌య‌మైంది. త‌రుచు ఆన్ లైన్లో మాట్లాడుకునేవారు.  ఈ క్ర‌మంలో ఇద్ద‌రి అభిప్రాయాలు క‌ల‌వ‌డంతో వారి మ‌ధ్య ప్రేమ చిగురించింది. ఇద్ద‌రూ క‌లిసి జీవించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో వారి ప్రేమ విష‌యాన్ని త‌మ త‌ల్లిదండ్రుల‌కు చెప్పారు. పెద్ద‌లు కూడా వారి పెళ్లికి అంగీక‌రించారు. దీంతో ప్రియురాలిని వారి త‌ల్లిదండ్రుల‌కు త‌మిళ‌నాడుకు రప్పించాడు కాళిదాసు. హిందూ సంప్రదాయ ప్ర‌కారం.. రామేశ్వరంలోని భద్రకాళి ఆలయంలో బుధవారం ఆమె మెడ‌లో మూడుమూళ్లు వేసి.. పెళ్లి చేసుకున్నాడు.  పలువురు బంధుమిత్రులు హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు.

Follow Us:
Download App:
  • android
  • ios