కష్టమ్స్ అధికారులకు దొరకకుండా బంగారాన్ని కాజేసేందుకు ఇద్దరు మహిళలు చేసిన పని.. అందరినీ విస్తుపోయేలా చేసింది. వారి ప్రైవేట్ పార్ట్స్ లో బంగారు బిస్కెట్లను దాచిపెట్టి ఇద్దరు మహిళలు స్మగ్లింగ్ కి పాల్పడిన సంఘటన ముంబయి ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...సూడాన్ దేశానికి చెందిన ఇద్దరు మహిళలు షార్జా నుంచి బంగారు బిస్కెట్లను జననేంద్రియాల్లో పెట్టుకొని వస్తుండగా మెటల్ డిటెక్టరు తనిఖీల్లో బీప్ సౌండ్ రావడంతో గుర్తించి వారిని సోదా చేశారు. దీంతో ఒక్కో మహిళ వద్ద ఆరు బంగారం బిస్కెట్లు లభించాయి.

 బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు వారిని పోలీసులు అరెస్టు చేసి బెయిలుపై విడుదల చేశారు. వీరితో పాటు రెండు వేర్వేరు కేసుల్లో 6.4 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొని నలుగురు నిందితులను అరెస్టు చేశారు.