అన్ని మతాలు సమానమే అని, ఎంపీలు ఏ మతాన్ని అయినా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. సభలో ఉన్నప్పుడు సభ్యులు ఇతరులపై దురుసుగా ప్రవర్తించకూడదని తెలిపారు. నిందలు వేయడానికి పార్లమెంట్ ను వేదికగా చేసుకోకూడదని సూచించారు. 

రాజ్యాంగం ముందు అన్ని మతాలు సమానమేనని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఎంపీలు మ‌త విశ్వాసాలు దెబ్బ తీసేలా మాట్లాడ‌కూడ‌ద‌ని తెలిపారు. ఏ మతాన్ని అయినా రెచ్చ‌గొట్టే విధంగా ప్రకటనలు చేయడం మానుకోవాలని అన్నారు. పార్లమెంట్ గౌరవాన్ని ఎళ్ల‌వేళ‌లా కాపాడాలని అన్నారు. లోక్‌సభ స్పీకర్‌గా బాధ్య‌తలు చేప‌ట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్బంగా ఆయ‌న ఆదివారం ‘‘పీటీఐ, టైమ్స్ నౌ’’ మీడియా సంస్థ‌ల‌తో మాట్లాడారు. త‌న యాత్రను విజయవంతం చేయడంలో సహకరించిన అన్ని రాజకీయ పార్టీల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కాలంలో సభ సగటు ఉత్పాదకత సాధించడం గొప్ప విజయమని అన్నారు. 

Agnipath : ‘‘52 ఏళ్లు జాతీయ జెండా ఎగుర‌వేయ‌ని వారు సైనికుల‌ను గౌర‌విస్తారా..’’ - రాహుల్ గాంధీ

17వ లోక్‌సభలో ఇప్పటి వరకు ఎనిమిది సెషన్‌లలో సుమారు వెయ్యి గంటలపాటు సభలో పని చేశామని ఓం బిర్లా చెప్పారు. పార్లమెంటులో మాట్లాడేటప్పుడు ఎంపీలు అనవసరమైన దూకుడు, శబ్దం చేసే గొడవలకు దూరంగా ఉండాలని కోరారు చర్చ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన భాగమ‌ని తెలిపారు. అయితే పార్లమెంటులో ఎంపీలు అనవసర దూకుడు, సందడి మానుకోవాల‌ని సూచించారు. నిరాధారమైన ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసేందుకు రాజకీయ నేతలు పార్లమెంటును వేదికగా ఉపయోగించుకోరాదని అన్నారు. మతాలపై ఈ రోజుల్లో రాజకీయ నాయకుల మధ్య తీవ్ర చర్చ జరుగుతోందన్న ప్రశ్నకు, రాజ్యాంగం ముందు అన్ని మతాలు సమానమని, పార్లమెంటు సభ్యులు ఏ మతానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం మానుకోవాలని బిర్లా సూచించారు.

బీజేపీ ఆఫీసుల్లో ‘అగ్నివీర్స్’ను సెక్యూరిటీ గార్డులుగా నియమించుకుంటాం - కైలాష్ విజయ వర్గియా

మతపరమైన అంశాలపై మాట్లాడేటప్పుడు ఎంపీలు తమ ప్రకటనల ద్వారా ఇతర మతాల మనోభావాలను దెబ్బతీయకూడదని గుర్తుంచుకోవాలని అన్నారు. మనమందరం ఈ సంప్రదాయాన్ని పూర్తి భక్తితో పాటించాల‌ని చెప్పారు. మన రాజ్యాంగం ప్రతీ ఒక్కరూ తమ మతాన్ని అనుసరించే హక్కును కల్పించింద‌ని గుర్తు చేశారు. రాజ్యాంగం ప్రకారమే పార్లమెంట్ పనిచేస్తోందన్నారు. ఫేస్‌బుక్ విజిల్-బ్లోయర్ సోఫీ జాంగ్‌ను ఐటికి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు హాజరుకావద్దని కోరడంపై ఓం బిర్లా మాట్లాడుతూ.. పార్లమెంటరీ కమిటీకి ఎవరూ హాజరుకావాల్సిన అవసరం లేదని, కాల్ చేయడానికి నియమాలు, నిబంధనలు ఉన్నాయని అన్నారు. తనను కమిటీ పిలవలేదు అని ఎవరైనా అనడం సరికాదని బిర్లా అన్నారు. 

చెప్పులు కుడుతున్న సివిల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్.. వైర‌ల్ అవుతున్న ఫొటోలు

సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కింద నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనం విషయంలో బిర్లా మాట్లాడుతూ.. ఇది ఆధునిక భారతదేశం, మన గొప్ప చరిత్ర రెండింటినీ ఒక సంగ్రహావలోకనం ఇస్తుందని అన్నారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల సంస్కృతిని ప్రదర్శిస్తుందని తెలిపారు. కోవిడ్ -19 మహమ్మారి ద్వారా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం విష‌యంలో ఆయ‌న మాట్లాడుతూ.. ‘‘ క‌రోనా మనందరికీ పెద్ద సవాలుగా ఉంది. ప్రతీ ఒక్కరి భద్రతను నిర్ధారించడానికి మేము మంచి హెల్త్ ప్రొటోకాల్ ను అనుసరించాము. అలాగే ఎంపీలు, సిబ్బంది స‌హకారం వ‌ల్ల పార్లమెంటు సజావుగా సాగింది ’’ అని ఆయ‌న అన్నారు. కాగా ఓం బిర్లా 2019 సంవ‌త్స‌రం జూన్ 19వ తేదీన లోక్ స‌భ స్పీక‌ర్ గా ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు.