తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి సివిల్ ఇంజనీరింగ్ చదివి చెప్పులు కుడుతున్నాడు. బయట రూ. 4-5 వేలకు ఉద్యోగం చేయడం ఇష్టం లేక తాను ఈ పని చేస్తున్నానని అతడు చెబుతున్నాడు. అయితే అతడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సివిల్ ఇంజినీర్లు అంటే మనందరికి ముందుగా గుర్తుకు వచ్చేది మంచి జీతంతో పాటు విలాసవంతమైన జీవన శైలి. సమాజంలో మంచి స్టేటస్. సాధారణంగా ప్రతీ సివిల్ ఇంజనీర్ పరిస్థితి ఇలాగే ఉంటుందని మన అనుకుంటాం కదా. కానీ మనం అనుకున్నట్టు అందరి పరిస్థితి ఒకేలా ఉండదు. దానికి ఉదాహరణే తమిళనాడుకు చెందిన కార్తిక్. ఆయన ఓ ఇంజనీరింగ్ పట్టభద్రుడు. కానీ బతుకుదెరువు కోసం అతడు చెప్పులు కుడుతున్నాడు. అయితే అతడు చెప్పులు కుడుతున్న ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి అతడు ఎందుకు ఈ పని చేస్తున్నాడు ? ఆయనకు ఎదురైన పరిస్థితులు ఏంటి ? అనే విషయాలు తెలుసుకుందాం.
బెంగళూరులో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. ముగ్గురు మృతి
వార్తా సంస్థ ANI తెలిపిన వివరాల ప్రకారం.. కార్తిక్ ది తమిళనాడులోని శివగంగ జిల్లా. ఆయన సివిల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. అయితే ఆయనకు నెలకు రూ. 4000-5000 నామమాత్రపు జీతంతో ఉద్యోగం వచ్చింది. అంత తక్కువ జీతంగా బతకడం అసాధ్యం అని ఆయన భావించాడు. మరి బతుకుదెరువు కోసం ఏదో ఒకటి చేయాలని అనుకున్నాడు. దీని కోసం ఆలోచన మొదలు పెట్టాడు.
కార్తిక్ తండ్రి చెప్పులు కుట్టేవాడు. తను కూడా ఎందుకు చెప్పులు కుట్టడమే జీవనాధారంగా ఎంచుకోకూడదని అనుకున్నాడు. ఇప్పుడు తన ముందు ఉన్న ఏకైక మార్గం చెప్పులు కుట్టడమే అని భావించి ఆ పనినే మొదలు పెట్టాడు. అయినా ఈ వృత్తి ద్వారా కార్తిక్ పెద్దగా ఏమీ సంపాదించలేకపోతున్నాడు. కాకపోతే ఒక వృత్తిలో అయితే కొనసాగుతున్నారు. తనకు ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తే ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన కోరుతున్నారు.
Agnipath: ఒకవైపు అగ్నిపథ్ నిరసనలు.. మరోవైపు అగ్నివీరులకు ప్రోత్సాహకాలు !
కార్తిక్ కు సంబంధించిన ఫొటోలు, అతడి కథ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీటికి నెటిజన్లు పలు రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ‘‘ మన దేశంలో ఒక ఇంజనీర్ రూ. 4-5 వేల ఉద్యోగం పొందడం కంటే పెద్ద పీడకల ఏముంటుంది? ’’ అని ఓ యూజర్ కామెంట్ రాశారు. ప్రయివేటు రంగంలో ముఖ్యంగా సివిల్ ఇంజినీరింగ్ రంగంలోని వేతనాలను ప్రభుత్వం సంస్కరించాలని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. పగటిపూట చాలా మంది వ్యక్తులు కేవలం రూ. 15-20కే నిలబడటం చూశానని మరో యూజర్ కామెంట్ చేశారు ఓ వ్యక్తి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ట్యాగ్ చేసి, గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగాలు అవసరం లేని వారికి సహాయం చేయాలని కోరారు
