52 సంవత్సరాల పాటు జాతీయ జెండాను గౌరవించని వారు దేశ సైనికులను గౌరవిస్తారని తాను అనుకోవడం లేదని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. అగ్నివీర్ లను తమ పార్టీ ఆఫీసులకు సెక్యూరిటీ గార్డులుగా నియమించుకుంటామని బీజేపీ సీనియర్ నాయకుడు కైలాష్ విజయ వర్గియ వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ విధంగా మాట్లాడారు. 

కేంద ప్ర‌భుత్వం తాజాగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. వీరికి ప్ర‌తిప‌క్ష పార్టీలు మ‌ద్ద‌తు తెలుపుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు. త‌మ పార్టీ కార్యాలయానికి సెక్యూరిటీ గార్డ్ లుగా అగ్నివీర్‌లను నియమించుకుంటామ‌ని బీజేపీ సీనియర్ నాయకుడు కైలాష్ విజయ వర్గియా చేసిన వ్యాఖ్యలను కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. 

‘‘ స్వాతంత్య్రం వచ్చి 52 ఏళ్లయినా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయని వారు సైనికులను గౌరవిస్తారని అనుకోలేం.. యువత సైన్యంలో చేరాలన్న తపన దేశాన్ని కాపాడుకోవడం కోసం. వాచ్‌మెన్‌గా మారి బీజేపీ ఆఫీసులను కాపాడుకోవడానికి కాదు. ఈ అంశంపై ప్ర‌ధాని మౌనంగా ఉండ‌టం మ‌రింత అవ‌మాన‌కరం ’’ అని ఆయ‌న అన్నారు. కాగా అగ్నిపథ్ స్కీమ్‌కు తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ఢి ల్లీలోని జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహ దీక్షకు దిగారు. ఈ సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దిగ్విజయ్ సింగ్, కేసీ వేణుగోపాల్, అధిర్ రంజన్ చౌదరి, జైరామ్ రమేష్, అజయ్ మాకెన్.. తదితరులు పాల్గొన్నారు. ‘‘అగ్నిపథ్ స్కీమ్ వాపస్ లో’’ (అగ్నిపథ్ స్కీమ్‌ను వెనక్కి తీసుకోవాలి) అని ఫ్లకార్డులు ప్రదర్శించారు. 

చెప్పులు కుడుతున్న సివిల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్.. వైర‌ల్ అవుతున్న ఫొటోలు

ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ కేంద్రంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘‘పదే పదే ఉద్యోగాలపై తప్పుడు ఆశలు కల్పించడం ద్వారా ప్రధాని దేశంలోని యువతను నిరుద్యోగం అనే 'అగ్నిబాట'లో నడిచేలా ఒత్తిడి తెచ్చారు. 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి.. కానీ యువతకు పకోడీలు వేయించే జ్ఞానం మాత్రమే వచ్చింది. దేశ ఈ పరిస్థితికి ప్రధానమంత్రి మాత్రమే బాధ్యత వహించాలి’’ అని రాహుల్ ట్వీట్ లో డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ 'మాఫీవీర్'గా మారి.. యువ‌త డిమాండ్‌కు త‌లొగ్గుతారని అన్నారు. 

Agnipath: ఒక‌వైపు అగ్నిప‌థ్ నిర‌స‌న‌లు.. మ‌రోవైపు అగ్నివీరుల‌కు ప్రోత్సాహ‌కాలు !

కాగా బీజేపీ సీనియ‌ర్ నేత కైలాష్ విజయ వర్గియా అగ్నివీర్స్ పై చేసిన కామెంట్స్ నేప‌థ్యంలోనే రాహుల్ గాంధీ ఈ విధంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆదివారం ఇండోర్ లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న త‌మ పార్టీ కార్యాల‌యాల్లో ‘అగ్నివీర్స్’ ను సెక్యూరిటీ గార్డులుగా నియమించుకోవడానికి తాను ఇష్ట‌ప‌డుతాన‌ని అన్నారు. క్రమశిక్షణ, ఆదేశాలను పాటించడం సాయుధ దళాల్లో ముఖ్యమైన భాగమని ఆయ‌న అన్నారు. ‘‘ అగ్నివీర్ 21 ఏళ్ల వయసులో సాయుధ దళాల్లో చేరాడనుకోండి, అప్పుడు అతడు దళాలను విడిచిపెట్టే సమయానికి 25 ఏళ్లు వస్తాయి. అతని చేతిలో రూ. 11 లక్షల నగదు ఉంటుంది. అతడి ఛాతీపై ‘అగ్నివీర్’ పతకం గర్వంగా ఉంటుంది. ఇక్కడ బీజేపీ కార్యాలయానికి భద్రత కోసం నేను ఎవరినైనా నియమించుకోవాల్సి వస్తే, నేను ఆయనకు ప్రాధాన్యత ఇస్తాను ’’ అని కైలాష్ విజయ వర్గియా అన్నారు. 

బెంగళూరులో ఎడ‌తెర‌పి లేకుండా కురుస్తున్న వర్షాలు.. ముగ్గురు మృతి

ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది స్పందించారు. ‘‘సెక్యూరిటీ గార్డులుగా మారడానికి మన సాయుధ దళాలు అగ్నివీర్స్ కు శిక్షణ ఇస్తాయి. యూనిఫారంలో ఉన్న మన పురుషుల ప్రాముఖ్యతను ఇది చిన్నచూపు చూస్తోంది. ’’ అని ఆమె అన్నారు. అయితే త‌న వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మార‌డంతో విజ‌య వ‌ర్గియా ట్విట్ట‌ర్ పోస్ట్ ద్వారా దానిని క‌వ‌ర్ చేసున్నారు. టూల్ కిట్ ముఠా త‌న వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రించింద‌ని ఆరోపించారు. టూల్ కిట్ తో సంబంధం ఉన్న వ్యక్తులు తన ప్రకటనను వక్రీకరించడం ద్వారా అగ్నివీర్ ల‌ను అవమానించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. వారు చేసిన కుట్రల గురించి దేశానికి బాగా తెలుసని ఆయన తెలిపారు.