Asianet News TeluguAsianet News Telugu

సవతి కొడుకును చంపి... మురుగు ట్యాంకులో దాచిన తల్లి..

సవతి కొడుకును చంపిన ఓ తల్లి ఆ తరువాత అతని మృతదేహాన్ని మురుగు ట్యాంకులో దాచిపెట్టింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది. 

Mother killed stepson and hides body in sewage tank Uttar Pradesh - bsb
Author
First Published Oct 18, 2023, 1:23 PM IST

ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ తన సవతి కొడుకును చంపి, మురుగుకాలువలో పడేసింది. సవతి కుమారుడి మీద ఉన్న కోపాన్ని ఇలా తీర్చుకుంది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని గాజియాబాద్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అక్కడ స్థానికంగా ఉన్న రాహుల్ సేన్ అనే వ్యక్తికి వివాహం అయ్యింది. ఆ తరువాత అతను భార్యతో విడిపోయాడు. అప్పటికే అతనికి ఓ కొడుకు ఉన్నాడు.

ఆ తరువాత రేఖ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య 11 యేళ్ల కొడుకు షాదాబ్ వాళ్ల దగ్గరే ఉంటున్నాడు. పెళ్లైన తరువాత ఈ నెల 15తేదీనుంచి షాబాద్ కనిపించకుండా పోయాడు. కొడుకు కనిపించడంలేదని భార్యను అడిగితే.. గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు చెప్పి, నమ్మించింది. 

బాబోయ్... కింగ్ కోబ్రాకు తలస్నానం.. వీడికసలు భయం లేదా?...వైరల్ వీడియో..

దీంతో రాహుల్ సేన్ పోలీసులను ఆశ్రయించాడు. ఆయన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ టీవీ కెమెరాలు పరిశీలించారు. అయితే, షాదాబ్ ఇంట్లో నుంచి బైటికి వెళ్లినట్టు కనిపించలేదు. వెంటనే పోలీసులు కుటుంబసభ్యులనే  అనుమానించారు. దీంతో వారిని ప్రశ్నించారు. వారి విచారణలో రేఖ తాను చేసిన నేరాన్ని అంగీకరించింది. బాలుడిని చంపిన తరువాత.. తన స్నేహితురాలితో కలిసి మృతదేహాన్ని మురుగు నీటి ట్యాంకులో దాచిపెట్టినట్లు తెలిపింది. 

ఇదిలా ఉండగా, రెండేళ్ల చిన్నారిని ఆమె సొంత పిన్ని గుక్క పట్టి ఏడుస్తుందన్న కారణంతో గొంతు నులిమి చంపేసింది. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో మహమ్మద్ షకిల్ అనే వ్యక్తి ఉంటున్నాడు. అతను, అతని సోదరుడు ఇద్దరు ఒకే ఇంట్లో కాపురం ఉంటారు. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. షకీల్ కు రెండేళ్ల వయసున్న కుమార్తె ఉంది. ఆ చిన్నారి సోమవారం నాడు ఆడుకుంటూ తన పిన్ని గదిలోకి వెళ్ళింది.

కాసేపు అక్కడే ఆడుకున్న తర్వాత ఆమె పిన్ని.. తనకు నిద్ర వస్తుంది తల్లి దగ్గరికి వెళ్ళమని చెప్పింది. కానీ దీనికి చిన్నారి ఒప్పుకోలేదు. తాను ఇక్కడే ఉంటానంటూ మారాం చేసింది. ఎంత చెప్పినా వినకపోవడంతో కోపానికి వచ్చిన ఆ పిన్ని చిన్నారిని చెంప దెబ్బ కొట్టింది. వెంటనే పెద్దపెట్టున గుక్క పట్టి ఏడవడం మొదలుపెట్టింది చిన్నారి. దీంతో తీవ్ర అగ్రహావేషాలకు లోనైన చిన్నారి పిన్ని బాలిక గొంతు నులిమింది. అక్కడికక్కడే బాలిక చనిపోయింది.

ఆ తర్వాత బాలిక మృతదేహాన్ని సోఫా కింద దాచి పెట్టింది.  కాసేపటి తర్వాత చిన్నారి కోసం పాప తల్లి వెతికింది. ఎక్కడా కనిపించకపోవడంతో.. అంతటా గాలించిన తల్లిదండ్రులు చివరికి పోలీసులను ఆశ్రయించారు. ఇంట్లో ఉన్న చిన్నారి ఎలా కనిపించకుండా పోతుంది? అనే సందేహంతో పోలీసులు దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. కాగా, చిన్నారి ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన ఆనవాళ్లు అందులో కనిపించలేదు. ఇంట్లోనే ఎక్కడో దాక్కునే ఉంటుందని వెతకగా సోఫా కింద చిన్నారి మృతదేహం వెలుగు చూసింది.

Follow Us:
Download App:
  • android
  • ios