Asianet News TeluguAsianet News Telugu

ప్రేమించిందని.. 15 ఏళ్ల కూతురిని కర్రలు, గొడ్డలితో కొట్టి చంపి, మృతదేహాన్ని బావిలో పడేసిన కన్నతల్లి...

ప్రేమించొద్దంటే వినలేదని 15యేళ్ల వయసున్న కూతురిని గొడ్డలి, కర్రలతో నరికి చంపి..బావిలో పడేసిందో తల్లి. ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Mother-in-law hacks 15-year-old daughter to death and threw the body in a well in uttarpradesh - bsb
Author
First Published Oct 31, 2023, 8:25 AM IST

ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లోని కోశాంబిలో అమానుష ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ తన 15యేళ్ల కూతురిని అత్యంత దారుణంగా హతమార్చింది. ఆ తరువాత ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోమవారం పోలీసులు కూతురి హత్య కేసులో ఆ మహిళను అరెస్ట్ చేశారు. ఈ మేరకు పోలీసులు సోమవారం తెలిపారు. 

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే.. ఓ మహిళ తన 15 ఏళ్ల కుమార్తెను గొడ్డలితో చంపి, ఇతర కుటుంబ సభ్యుల సహాయంతో ఆమె మృతదేహాన్ని బావిలో పడవేసింది. ఈ మేరకు శివపతి అనే మహిళపై ఆరోపణలు వచ్చాయి. అయితే అంతకు ముందు శివపతి తన కుమార్తె కనిపించడకుండా పోయిందని, ఎవరో ఆమెను కిడ్నాప్ చేశారని మంజన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్పీ బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. 

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ. 24 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..

అక్టోబర్ 2న ఏదో పని నిమిత్తం పొలానికి వెళ్లిన కూతురు అప్పటి నుంచి ఇంటికి రాకపోవడంతో శివపతి అక్టోబర్ 14న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై కిడ్నాప్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్పీ తెలిపారు. అక్టోబరు 26న తేజ్వాపూర్ గ్రామం బయటున్న పొలంలోని బావిలో బాలిక మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. శివపతి మృతదేహం తన కూతురిదేనని గుర్తించింది. దీంతో మిస్సింగ్ కేసును భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 (హత్యకు శిక్ష)ను ఈ కేసులో చేర్చారని పోలీసులు తెలిపారు.

అయితే, కొన్ని ఆధారాలు శివపతిని ప్రధాన నిందితురాలిగా తేల్చాయి. సోమవారం హత్య కేసులో ఆమెను అరెస్టు చేశారు. ఆమెను ఆమెతో పాటు మరొక మైనర్ కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె కోడలు మీరా పరారీలో ఉందని, ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వారు తెలిపారు.

పోలీసుల విచారణలో శివపతి అందించిన సమాచారం మేరకు హత్యకు ఉపయోగించిన గొడ్డలి, కర్రను స్వాధీనం చేసుకున్నామని, మృతదేహాన్ని దాచేందుకు ఉపయోగించిన గోనె సంచిని కూడా స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు.

కూతురు అదే గ్రామానికి చెందిన అబ్బాయితో ప్రేమలో పడింది. దీన్ని తల్లి నిరాకరించింది. అతనితో తిరగొద్దని తెలిపింది. అయితే, కూతురు ఒప్పుకోలేదు. తల్లి వద్దన్నా అతనితో తిరుగుతోంది. దీంతో హతమార్చినట్లు నిందితులు విచారణ సందర్భంగా పోలీసులకు తెలిపారని శ్రీవాస్తవ తెలిపారు. అక్టోబర్ 2వ తేదీ అర్ధరాత్రి తాను, ఆమె మరో కూతురు, మీరా కలిసి గొడ్డలి, కర్రతో కొట్టి హత్య చేసినట్లు శివపతి అంగీకరించింది. 

హత్య అనంతరం మృతదేహాన్ని జనపనార సంచిలో నింపి తమ ఊరి బయట పొలంలో ఉన్న బావిలో పడేసినట్లు ఎస్పీ తెలిపారు. అయితే, కూతురి విషయం ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండడం కోసం.. నిందితులు గుర్తుతెలియని వ్యక్తుల మీద కిడ్నాప్‌ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios