నిజంగానే తనకు పెళ్లా లేక పబ్లిసిటీ కోసం ఇలా చేస్తుందా అనే విషయాలను పక్కన పెడితే సోషల్ మీడియాలో రాఖీ సావంత్, ఆమెకి కాబోయే భర్త దీపక్ కలాల్ చేస్తోన్న రచ్చ మాములుగా లేదు. ఈ ఇద్దరూ తము పెళ్లి చేసుకోబోతున్నామని వెడ్డింగ్ కార్డ్ ని అభిమానులతో షేర్ చేసుకున్నారు.

తరచూ వివాదాలతో వార్తల్లో ఉండే రాఖీ ఆమెకు తగ్గట్లుగానే మరో వివాదాస్పద వ్యక్తితో వివాహానికి రెడీ అయింది. ఆమెను పెళ్లి చేసుకోబోయే దీపక్ సోషల్ మీడియాలో ఆడవాళ్ల లో దుస్తులు ధరించి ఆడ గొంతుతో మాట్లాడుతూ ఏవేవో వీడియోలను పోస్ట్ చేస్తూ ట్రోలింగ్ కి గురవుతుంటాడు.

ఇక రాఖీతో పెళ్లి అనగానే దీపక్ మరింత రెచ్చిపోయి పిచ్చి పిచ్చి పోస్ట్ లు పెట్టడం మొదలుపెట్టాడు. రాఖీ సావంత్ గతంలో తన అండర్ వేర్ కి తాళం వేసుకొని ఫోటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ అండర్ వేర్ తాళం చెవి తన చేతికి చిక్కిందని నెటిజన్లకు చూపిస్తున్నాడు. దీంతో పాటు మరో షాకింగ్ విషయాన్ని కూడా వెల్లడించాడు.

పెళ్లికి ముందు ఇద్దరం కన్యత్వ పరీక్షలు చేయించుకోగా.. తామిద్దరం వర్జిన్లుగా తేలిందని ఇది తమకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెబుతూ సంబర పడిపోతున్నాడు. అసలు పెళ్లి జరుగుతుందో లేదో కానీ పెళ్లి పేరుతో వీరు చేసే రచ్చ కారణంగా సోషల్ మీడియాలో నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. 

రాఖీ సావంత్ పెళ్లి.. మళ్లీ ఫేకేనా..?