పెళ్లిలో వధువు వాంతులు చేసుకుందని.. అనుమానంతో వరుడు ఆమెకు ప్రెగ్నెన్సీ, కన్యత్వ పరీక్షలు చేయించాడు. ఈ దారుణ సంఘటన  కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. కాగా.. విషయం తెలుసుకున్న వధువు.. వరుడిని వదిలేసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకు చెందిన రక్షిత(26), శరత్(29)లు ఎంబీఏ పూర్తి చేసి పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిద్దరికీ మ్యాట్రీమోనీ వెబ్ సైట్ ద్వారా పరిచయం ఏర్పడింది. కాగా.. నవంబర్ 2018లో వీరు పెళ్లి చేసుకోవాలని భావించారు.

సరిగ్గా పెళ్లికి 15రోజులు గడువు ఉందనగా.. రక్షిత తల్లి క్యాన్సర్ తో కన్నుమూశారు. దీంతో రక్షిత డిప్రెషన్ కి గురయ్యింది. దీంతో.. పెళ్లి ఆలస్యంగా జరిగింది. అయితే... తల్లి చనిపోయిన సమయంలో ఆమెకు చిన్ననాటి స్నేహితుడు ఓకరు ఓదార్పుగా నిలిచాడు. కాగా.. అతని తీరు పట్ల శరత్ లో అనుమానం మొదలైంది.

కాగా.. తర్వాత రక్షిత, శరత్ ల వివాహం జరిగింది. తాళికట్టిన కొద్దిసేపటికే తీసుకున్న ఆహారం అరగక.. రక్షితకు వాంతులు అయ్యాయి. దీంతో.. ఆమె గర్భవతి అన్న అనుమానం శరత్ కి కలిగింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లి కన్యత్వ, ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయించాడు. అవి చేయించిన తర్వాత ఆమెకు అసలు విషయం తెలిసింది.

దీంతో ఆమె వెంటనే అతనిని వదిలేసి తన సోదరి ఇంటికి వెళ్లింది. పెళ్లి జరిగినా కూడా తన భార్య తన ఇంటికి రావడం లేదంటూ శరత్ పోలీసులను ఆశ్రయించాడు. కాగా.. ఆమెకు కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ప్రయత్నించగా.. అసలు విషయం తెలుసుకొని అధికారులే షాకయ్యారు. కాగా... అతనికి కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా అతనిలో మార్పు రాలేదు. దీంతో.. ప్రస్తుతం వారు విడాకులు తీసుకోవాడనికి సిద్ధమయ్యారు.