Asianet News TeluguAsianet News Telugu

పాకిస్తాన్‌పై మరిన్ని సర్జికల్ స్ట్రైక్‌లు చేస్తాం: హోం మంత్రి అమిత్ షా వార్నింగ్

పాకిస్తాన్ దాని వక్రబుద్ధి మార్చుకోకుంటే మరిన్ని సర్జికల్ స్ట్రైక్‌లు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భారత సరిహద్దులోకి చొచ్చుకురావడం, పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్‌లో విధ్వంసాలకు పాల్పడే కుట్రలను మానకపోతే మరిన్ని మెరుపుదాడులు చేస్తామని తెలిపారు.
 

more surgical strikes on pakistan amit shah warning
Author
Panaji, First Published Oct 14, 2021, 4:15 PM IST

న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో ఇటు Pakistan, అటు చైనా కవ్వింపు చర్యలకు దిగుతున్నాయి. గతేడాది నుంచి చైనా border సమీపంలో తిష్టవేసి కూర్చుంది. ఇప్పటికీ ఉపసంహరణ ప్రక్రియ పూర్తవనే లేదు. కాగా, పాకిస్తాన్ ఉగ్రవాదులను సరిహద్దు గుండా భారత్‌లోకి పంపిస్తున్నది. పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరేపిత terrorism భారత్‌లో అస్థిరత సృష్టించడానికి ప్రయోగిస్తున్నది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాకిస్తాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

భారత దేశంపై దాడులను తాము సహించబోమని Union Home Minister Amit Shahఅన్నారు. surgical strikes ఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించాయని వివరించారు. పాకిస్తాన్ దాని వక్రబుద్ధి మార్చుకోకుంటే మరిన్ని దాడులు చేయడానికి వెనుకాడబోమని warning ఇచ్చారు.

గోవాలోని దర్బండోరాలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ వ్యవస్థాపక కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఇందులో ఆయన మాట్లాడుతూ భారత సరిహద్దుల ప్రస్తావనను తెచ్చారు. ఎంతో కాలం నుంచి భారత సరిహద్దులో పాకిస్తాన్ నుంచి మోర్టార్లు, బుల్లెట్లు దూసుకురావడం, మన జవాన్లు మరణించడం జరుగుతూనే ఉన్నదని వివరించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ తరుచూ ఉల్లంఘించిందన్నారు. ఆ దేశ ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదులు సరిహద్దు గుండా అక్రమంగా దేశంలోకి చొరబడుతున్నారని తెలిపారు. ఇంతకాలం ఈ అంశాలపై చర్చించడానికి భారత్ అవకాశమిచ్చిందని తెలిపారు. కానీ, ఇకపై చర్చలు ఉండవని, దెబ్బకు దెబ్బ తీయడమేనని అన్నారు. 

Also Read: ఆ పాకిస్తాన్ ఉగ్రవాది భారతీయ మహిళను పెళ్లాడాడు.. అసలు ఇండియాకు ఎప్పుడు వచ్చాడంటే?

ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అప్పటి రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరికర్ సారథ్యంలోనే కీలక అడుగు పడిందని వివరించారు. భారత సరిహద్దులను ఎవ్వరూ డిస్టర్బ్ చేయవద్దనే బలమైన మెస్సేజ్‌ను తొలిసారిగా పంపామని చెప్పారు. వారిద్దరి సారథ్యంలోనే పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టామని అన్నారు.

2016 సెప్టెంబర్‌లో పాకిస్తాన్‌పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఉరి, పఠాన్‌కోట్, గుర్దాస్‌పూర్‌లలో టెర్రరిస్టులు దాడులు చేశారు. ఈ దాడులకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం పాకిస్తాన్ సరిహద్దులోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. అనేక టెర్రరిస్టు క్యాంపులను ఈ దాడిలో ధ్వంసం చేసినట్టు వార్తలు వచ్చాయి. ఉరిపై దాడి జరిగిన 11 రోజుల తర్వాత 2016 సెప్టెంబర్ 29వ తేదీన సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి.

Follow Us:
Download App:
  • android
  • ios