ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో చివరి రోజున కాంగ్రెస్ ఛీప్ మల్లికార్జున్ ఖర్గే మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీలను తీవ్రంగా విమర్శించారు.   

దేశ ప్రజల సొమ్ము, ఆస్తులను ప్రధాని మోడీ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీకి ఇస్తున్నారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ఛత్తీస్ గఢ్ లోని రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశంలో మూడో రోజు ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీని, అదానీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. కొద్ది మంది మాత్రమే ఈ దేశ ఆస్తులను దోచుకుంటున్నారని అన్నారు. ప్రధాని మోడీ మన దగ్గర ఒక్కో ఆస్తిని కొని వాటిని ఒకరికి ఇస్తున్నారని ఆరోపించారు.

మేఘాలయ రోడ్డు ప్రమాదంలో ఎన్నికల అధికారి మృతి.. ప‌లువురికి గాయాలు

“ఆ అదానీని ఇంత పెద్దగా చేశారు. ఈరోజు ఆ వ్యక్తి ఏనుగులా లావు అయ్యారు’’ అని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఇదే సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో రెండో స్థానానికి ఎలా చేరుకున్నారని ప్రశ్నించానని తెలిపారు. ‘‘ఎవరికీ లభించని అన్ని ప్రయోజనాలను ఆయన (అదానీ) పొందాడు. నేను ప్రధానమంత్రికి, అదానీకి మధ్య సంబంధం ఏమిటని మాత్రమే అడిగాను. బీజేపీ కార్యకర్తలందరూ అదానీని రక్షించడం ప్రారంభించారు. అదానీపై దాడి చేసే వారిని ‘దేశ ద్రోహి’ అని అన్నారు.

ఫ్రమ్ ది ఇండియా గేట్: కాంగ్రెస్‌లో కలల వ్యాపారులు, హనుమాన్‌కు నోటీసులు, ఎస్పీ మే కా బా..

పార్లమెంటులో అదానీపై ఎవరూ ప్రశ్నలు అడగలేరని, అయితే నిజం బయటకు వచ్చే వరకు తాము ప్రశ్నలు అడుగుతూనే ఉంటామని రాహుల్ గాంధీ తెలిపారు. దేశంలోని సంపద అంతా ఒక్కరి చేతిలోకే వెళ్లుతున్నదని, పోర్టులు, ఎయిర్ పోర్టులు, మౌలిక సదుపాయాలు, ఇతర కీలకమైన ప్రాజెక్టులు అన్నీ అదానీ చేతికే వెళ్లుతున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. ఆస్ట్రేలియాలో కూడా అదానీతో ప్రధాని మోడీ ఫొటోలు నిరసనల్లో కనిపించాయని గుర్తు చేశారు. అక్కడ ఎస్‌బీఐ అదానీకి భారీ మొత్తంలో రుణం ఇవ్వడానికి అంగీకరించిందని తెలిపారు. వీరి మధ్యకు మోడీ ఎందుకు వెళ్లారని అడిగారు. అక్కడ మోడీ అవసరం ఏమిటని ప్రశ్నించారు. అదానీ విమానంలో సేద తీరుతున్న మోడీ ఫొటోలు బయటకు వచ్చాయని కూడా పేర్కొన్నారు. 

Scroll to load tweet…

ఈ సందర్భంగా ఆయన భారత్ జోడో యాత్రను ప్రస్తావనకు తెచ్చారు. ‘‘ ఈ యాత్రలో చాలా నేర్చుకున్నాను. నేను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నా దేశం కోసం నడిచాను. యాత్రలో వేలాది మంది నాకు, పార్టీకి కనెక్ట్ అయ్యారు. నేను రైతుల అన్ని సమస్యలను విన్నాను. వారి బాధలను తెలుసుకున్నాను’’ అని అన్నారు.

అనేక దేశాలు భారత్ యూపీఐ వైపు చూస్తున్నాయి - ప్రధాని నరేంద్ర మోడీ

లాల్ చౌక్‌లో భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినట్లు ప్రధాని మోడీ చెప్పారని, అయితే ఆ తేడా తనకు అర్థం కాలేదని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీకి చెందిన 15-20 మందితో నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారని, కానీ 'భారత్ జోడో యాత్ర' లక్షలాది మంది కాశ్మీర్ యువతతో జెండాను ఎగురవేసిందని తెలిపారు.