Shillong: మేఘాలయలో జ‌రిగిన‌ రోడ్డు ప్రమాదంలో ఎన్నికల అధికారి మృతి చెందారు. మేఘాలయ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎఫ్ఆర్ ఖర్కోంగోర్ బాధిత కుటుంబానికి అన్ని విధాల ఆదుకుంటామ‌ని చెబుతూ.. ఆయన కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం ప్రకటించారు.

Election Official Dies In Road Accident: ఈశాన్య భార‌త రాష్ట్రమైన మేఘాలయలో జ‌రిగిన‌ రోడ్డు ప్రమాదంలో ఎన్నికల అధికారి మృతి చెందారు. మేఘాలయ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అధికారి బాధితుడి కుటుంబానికి అన్ని విధాల ఆదుకుంటామ‌ని చెబుతూ.. ఆయన కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం ప్రకటించారు.

వివ‌రాల్లోకెళ్తే.. వెస్ట్ గారో హిల్స్ లో ఓ పోలింగ్ స్టేష‌న్ కు వెళ్తున్న ఒక ఎన్నిక‌ల అధికారి రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఎన్నికల అధికారి ప్రయాణిస్తున్న వాహనం ఆదివారం నాడు ప్రమాదానికి గురైంద‌ని సంబంధిత అధికారులు తెలిపారు. ఎన్నిక‌ల డ్యూటీ మీద‌ అధికారులు తోటమతి వెళ్తుండగా వాహనం రోడ్డుపై బోల్తా పడటంతో అందులో ఉన్నవారు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. సంబంధిత అధికారులు 44-రక్షమ్‌గ్రే అసెంబ్లీ నియోజకవర్గంలోని 44/8 జంగ్రాపర ఎల్పీ స్కూల్‌కు వెళ్తున్నార‌ని స‌మాచారం. 

క్షతగాత్రులను వెంటనే సమీపంలోని తిక్కిళ్ల సీహెచ్ సీకి తరలించారు. అయితే, ఇద్ద‌రు అధికారుల‌కు తీవ్రంగా గాయాలు కావ‌డంతో వారిని గోల్పారాలోని ఉన్నత వైద్య కేంద్రానికి రిఫర్ చేస్తున్నామని తెలిపారు. మిగతా వారందరికీ ప్రథమ చికిత్స అందించారు. క్షతగాత్రులందరికీ వైద్య సహాయం అందిస్తున్నట్లు జిల్లా ఎన్నికల కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పోలింగ్ సామగ్రిని, ఈవీఎం/వీవీప్యాట్లను సంబంధిత సెక్టార్ మేజిస్ట్రేట్ సంబంధిత సెక్టార్ పోలీస్ అధికారితో కలిసి సీఏపీఎఫ్ సమక్షంలో భద్రపరిచి తీసుకెళ్లారు. మేఘాలయ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎఫ్ఆర్ ఖర్కోంగోర్ అధికారి మృతిప‌ట్ల విచారం వ్య‌క్తం చేశారు. బాధితుడి కుటుంబానికి అన్ని విధాల ఆదుకుంటామ‌ని చెబుతూ.. ఆయన కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం ప్రకటించారు.

"చెసన్ మరక్ నిబద్ధత కలిగిన కార్యకర్త, ప్రజాస్వామ్య బాధ్య‌తలు మోస్తున్న వ్య‌క్తి. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి అండ‌గా ఉంటాం. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారి దురదృష్టవశాత్తు మృతి చెందడం బాధ క‌లిగించింది. ఆయన కుటుంబ సభ్యులకు రూ.15 లక్షల ఎక్స్ గ్రేషియాను ఎన్నికల శాఖ అందిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకున్న పోలింగ్ అధికారులందరికీ, ఎన్నికల యంత్రాంగంలోని ప్రతి సభ్యుడూ ప్రజాస్వామ్యానికి నిజమైన 'పాద సైనికులు'గా చేసిన కృషికి కృతజ్ఞతతో సెల్యూట్ చేస్తున్నామని" ఎఫ్ఆర్ ఖర్కోంగోర్ పేర్కొన్నారు.


Scroll to load tweet…