భారత్ యూపీఐ అనేక దేశాలను ఆకర్శించుకుంటోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇటీవలే మన దేశ యూపీఐ- సింగపూర్ పేనౌ మధ్య అనుసంధానం జరిగిందని చెప్పారు. దీని వల్ల రెండు దేశాల ప్రజలు సులభంగా డిజిటల్ మనీ లావాదేవీలు జరుపుకుంటున్నారని తెలిపారు. 

భారతదేశం రూపొందించిన యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) వ్యవస్థ వైపు అనేక దేశాలు చూస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కొన్ని రోజుల కిందట భారత్- సింగపూర్ మధ్య యూపీఐ-పేనౌ లింక్ ప్రారంభమైందని అన్నారు. దీంతో ఇప్పుడు సింగపూర్, భారత్ ప్రజలు తమ దేశాల్లో మాదిరిగానే మొబైల్ ఫోన్ల నుంచి నగదు బదిలీ చేసుకుంటున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ తన నెల వారీ మాన్ కీ బాత్ (98వ) రేడియో కార్యక్రమంలో ఈ విషయాలను ప్రస్తావించారు.

అదానీని బీజేపీ ఎందుకు కాపాడుతున్నది? అదానీ, పీఎం మోడీ ఒక్కటే: రాహుల్ గాంధీ

కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ‘ఈ సంజీవని’ యాప్ ప్రజలకు గొప్ప వరంగా నిలిచిందని ప్రధాని చెప్పారు. డిజిటల్ ఇండియా శక్తికి ఇదో నిదర్శనం అని అన్నారు. ‘‘ ఈ యాప్ ద్వారా టెలి కన్సల్టేషన్ ద్వారా, ఎక్కడున్నా వీడియో కాల్ ద్వారా డాక్టర్ ను సంప్రదించవచ్చు. ఇప్పటి వరకు ఈ యాప్ ను వాడుతున్న టెలీ కన్సల్టెంట్ల సంఖ్య 10 కోట్లు దాటింది. రోగికి, వైద్యుడికి మధ్య ఉన్న ఈ అద్భుతమైన బంధం ఒక పెద్ద విజయం. ఈ ఘనత సాధించినందుకు, ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకున్న వైద్యులు, రోగులందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. భారత ప్రజలు టెక్నాలజీని తమ జీవితంలో భాగం చేసుకున్నారనడానికి ఇదొక సజీవ ఉదాహరణ’’ అని ప్రధాని అన్నారు. 

Scroll to load tweet…

ఈ రేడియో కార్యక్రమంలో ప్రధాన మంత్రి సిక్కింకు చెందిన డాక్ట ర్ మదాన్ మణితో మాట్లాడారు. అలాగే ఈ-సంజీవని యాప్ ద్వారా టెలీ కన్సల్టేషన్ ప్రయోజనాన్ని పొందిన ఉత్తరప్రదేశ్ లోని చందౌలి జిల్లాకు చెందిన రోగి మదన్ మోహన్ అనుభవాలను కూడా విన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ బొమ్మలు, కథలు చెప్పే రూపాల గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు.

లోక్ సభ ఎన్నికలకు ముందు విపక్షాలు ఏకమవుతాయి - కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ

మన్ కీ బాత్‌లో గతంలో మనం భారతీయ బొమ్మల గురించి ప్రస్తావించినప్పుడు.. నా తోటి పౌరులు దీన్ని తక్షణమే ప్రోత్సహించారు. ‘‘ఈ రోజుల్లో భారతీయ బొమ్మలకు చాలా క్రేజ్ ఏర్పడింది. విదేశాల్లో కూడా వాటి డిమాండ్ పెరిగింది. ‘మన్ కీ బాత్’లో కథ చెప్పే భారతీయ శైలి గురించి మాట్లాడినప్పుడు.. వారి కీర్తి కూడా పెరిగింది. భారతీయ కథ చెప్పే శైలికి ప్రజలు మరింతగా ఆకర్షితులవడం ప్రారంభించారు.’’ అని అన్నారు. 

పాలిటిక్స్ నుంచి సోనియా గాంధీ రిటైర్ అయ్యారా? ఆ కన్ఫ్యూజన్‌కు ఫుల్‌స్టాప్ పెట్టిన కాంగ్రెస్

'మన్ కీ బాత్' అనేది ప్రతీ నెలా చివరి ఆదివారం ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యే నెలవారీ ప్రసంగం. దీని ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలతో సంభాషిస్తారు. కాగా.. ప్రజల భాగస్వామ్యానికి వ్యక్తీకరణగా 'మన్ కీ బాత్'ను పౌరులు అద్భుతమైన వేదికగా చేసుకున్నారని ప్రధాని అన్నారు.