న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో వాస్తవాలను కోర్టు ముందుంచిన న్యాయవాదులను అభినందిస్తున్నట్టుగా మాజీ కేంద్ర మంత్రి మురళీ మనోహార్ జోషీ చెప్పారు.బాబ్రీ మసీదు కూల్చివేతపై  బీజేపీ సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహార్ జోషీలపై సీబీఐ కోర్టు కేసును కొట్టివేసింది.

బుధవారం నాడు ఈ కేసును సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది.ఈ తీర్పు వెలువరించిన తీర్పు తర్వాత మాజీ కేంద్ర మంత్రి మురళీ మనోహార్ జోషీ మీడియాతో మాట్లాడారు. ఇది కోర్టు తీసుకొన్న చారిత్రాత్మక నిర్ణయమన్నారు.

also read:జై శ్రీ రామ్: బాబ్రీ కుల్చివేత కేసుపై కోర్టు తీర్పు తర్వాత అద్వానీ

1992 డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదు కూల్చివేతలో ఎలాంటి కుట్ర లేదని రుజువైందన్నారు.  ఆనాడూ తాము నిర్వహించిన ర్యాలీలు, ప్రదర్శనల్లో ఏ కుట్రలో భాగం కాదన్నారు. తాము సంతోషంగా ఉన్నామని ఆయన చెప్పారు. కోర్టు తీర్పు తర్వాత జోషీ స్వీట్లు పంచారు. 

రామ మందిరం నిర్మాణం గురించి ఇప్పుడు అంతా ఉత్సాహంగా ఉన్నారని ఆయన తెలిపారు.ఇవాళ తీర్పును వెల్లడించే సమయంలో అద్వానీ, మురళీ మనోహార్ జోషీల అనారోగ్య కారణాలతో కోర్టుకు హాజరు కాలేదు. కరోనా కారణంగా  మాజీ కేంద్ర మంత్రి ఉమా భారతి హాజరుకాలేదు.

బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత అప్పటి ప్రభుత్వం లిబర్హాన్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఈ కేసు ను సీబీఐ విచారించింది.