న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేతపై  సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టుగా మాజీ కేంద్ర మంత్రి లాల్‌కృష్ణ అద్వానీ ప్రకటించారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కోర్టు తీర్పు వెలువడిన వెంటనే అద్వానీ జై శ్రీరామ్ అంటూ నినదించారు. కోర్టు తీర్పు అందరికీ ఆనందాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు.

1992  డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు. ఈ విషయమై ఏర్పాటు చేసిన సీబీఐ కోర్టు ఇవాళ తీర్పును వెల్లడించింది. అద్వానీ సహా పలువురిపై మోపిన కేసులను కోర్టు కొట్టివేసింది.

ఈ తీర్పు వెల్లడైన తర్వాత ఎల్ కే అద్వానీ బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు.  ఈ తీర్పు రామ జన్మభూమి ఉద్యమం పట్ల తన వ్యక్తిగత, బీజేపీ నమ్మకం, నిబద్ధతను రుజువు చేస్తోందన్నారు.

also read:బాబ్రీ మసీదు కేసులో అద్వానీ సహా అందరూ నిర్దోషులే: కోర్టు సంచలన తీర్పు

ఇవాళ తీర్పును వెల్లడించే సమయంలో అద్వానీ, మురళీ మనోహార్ జోషీల అనారోగ్య కారణాలతో కోర్టుకు హాజరు కాలేదు. కరోనా కారణంగా  మాజీ కేంద్ర మంత్రి ఉమా భారతి హాజరుకాలేదు.

బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత అప్పటి ప్రభుత్వం లిబర్హాన్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఈ కేసు ను సీబీఐ విచారించింది.