కరోనాతో దేశ ప్రజలు తీవ్ర భయాందోళనల మధ్య గడుపుతున్నారు. తోటి వ్యక్తి తుమ్మినా, దగ్గినా కంగారు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు కరెన్సీ నోట్లతో ప్రజలను ఇంకా భయపెడుతున్నారు.

తాజాగా హర్యానాలో గుర్తు తెలియని దుండుగులు నడిరోడ్డుపై కరెన్సీ నోట్లను వెదజల్లిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఖైతల్‌లోని కర్ణవిహార్‌లో శనివారం స్థానిక జింద్ బైపాస్ రోడ్డు సమీపంలో ఉన్న మురికివాడలో కొందరు దుండగులు రూ.500 నోట్లను వెదజల్లారు.

Also Read:భారత్‌లో 24 గంటల్లో 2,487 కేసులు.. 83 మంది మృతి: 40 వేలు దాటిన సంఖ్య

దీంతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీస్, వైద్య బృందాలు కరెన్సీ నోట్లను శానిటైజింగ్ చేశారు.

సదరు నోట్లపై ‘‘ నాకు కరోనా ఉంది’’ అని రోడ్డుపైకి విసిరారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాలనీవాసులు కరెన్సీ నోట్లను తీసుకోవడానికి భయపడ్డారని పోలీసులు వెల్లడించారు.

Also Read:కొత్త జంట ఫస్ట్ నైట్ కి కరోనా దెబ్బ: వరుడు సహా 26 మంది క్వారంటైన్‌కి

మొత్తం సొమ్మంతా కలిపి రూ.15,000 వరు ఉండొచ్చని తెలుస్తోంది. మరోవైపు దుండగుల్ని ఎవరూ చూడకపోవడంతో వారు ఎవరు, ఎందుకు ఇక్కడ నోట్లను వెదజల్లారా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.