Asianet News TeluguAsianet News Telugu

కొత్త జంట ఫస్ట్ నైట్ కి కరోనా దెబ్బ: వరుడు సహా 26 మంది క్వారంటైన్‌కి

కొత్తగా పెళ్లి చేసుకొన్న జంటకు ఫస్ట్ నైట్ కాకుండా లాక్ డౌన్ దెబ్బతీసింది. పెళ్లి కోసం ఇతర ప్రాంతం నుండి వచ్చినందుకు పెళ్లి కొడుకును క్వారంటైన్ కు తరలించారు.

bridegroom along with 26 people send to quarantaine in karnataka
Author
Bangalore, First Published May 3, 2020, 5:33 PM IST

బెంగుళూరు: కొత్తగా పెళ్లి చేసుకొన్న జంటకు ఫస్ట్ నైట్ కాకుండా లాక్ డౌన్ దెబ్బతీసింది. పెళ్లి కోసం ఇతర ప్రాంతం నుండి వచ్చినందుకు పెళ్లి కొడుకును క్వారంటైన్ కు తరలించారు.

కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లాలో కుత్యూరులో ఇటీవలనే పెళ్లి జరిగింది. లాక్ డౌన్ నేపథ్యంలో  పెళ్లిళ్లకు అతి తక్కువ మందితో అనుమతి ఇస్తున్నారు అధికారులు. లాక్ డౌన్ నేపథ్యంలో కొందరు పెళ్లిళ్లను కూడ వాయిదా వేసుకొన్నారు.

కానీ కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లాలో కుత్యూరులో పెళ్లి జరిగింది. మంగుళూరుకు చెందిన యువకుడు బోలాకు చెందిన యువతిని వివాహం చేసుకొన్నాడు.  పెళ్లి మాత్రం నిర్విఘ్నంగా జరిగింది. 

also read:కరోనా రోగులకు సేవలు: దేశంలో పలు ఆసుపత్రులపై హెలికాప్టర్లతో పూల వర్షం

రెండు కుటుంబాలు కొత్త జంటకు ఫస్ట్‌నైట్ కు ముహుర్తం నిర్ణయించారు. మరికొద్ది క్షణాల్లో ఫస్ట్ నైట్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే సమయంలో అధికారులు ఆ ఇంటికి చేరుకొన్నారు.  ఇతర గ్రామం నుండి వచ్చినందుకు గాను పెళ్లి కొడుకును క్వారంటైన్ కు తరలించాలని కోరారు.

అయితే రెండు కుటుంబాలు వరుడికి ఫస్ట్ నైట్ ముహుర్తంగా నిర్ణయించిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అయితే వేరే గ్రామం నుండి వచ్చినందున క్వారంటైన్ నిర్వహించాల్సిందేనని అధికారులు తేల్చి చెప్పారు. వరుడితో పాటు 26 మందిని క్వారంటైన్ కు తరలించారు అధికారులు. దీంతో కొత్త జంట ఫస్ట్ నైట్కు బ్రేక్ పడింది.

Follow Us:
Download App:
  • android
  • ios