Asianet News TeluguAsianet News Telugu

ఛీ..ఛీ.. కొడుకు లవర్ పై కన్నేసిన తండ్రి.. ఇంటికి వచ్చిన బాలికపై లైంగికదాడి...

 కుమారుడు ప్రేమించిన మైనర్ బాలికపై బాలుడి తండ్రి అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు బాళే హొన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. 

Minor Girl Sexually Assaulted by Lover's Father, Accused Arrest
Author
Hyderabad, First Published Nov 11, 2021, 2:58 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కర్ణాటక : బాలికలు మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకు నిర్భయలాంటి చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చినా.. అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. వావివరసలు, మంచీ చెడులు మరిచి, వయసు తేడాలు లేకుండా ఆడపిల్ల కనిపిస్తే చాలు కామంతో కళ్లు మూసుకుపోయి దారుణాలకు తెగబడుతున్నారు. 

తాజాగా కుమారుడు ప్రేమించిన మైనర్ బాలికపై బాలుడి తండ్రి అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు బాళే హొన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. అత్యంత జుగుస్స కలిగించే ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. 

బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు చిక్కమగళూరు బాళే హొన్నూరు పోలీసులు బుధవారం తెలిపారు. అతనిపై POCSO act కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  స్టేషన్ పరిధిలో ఓ ఇద్దరు minorలు ప్రేమించుకున్నారు.  

ఈ క్రమంలో బుధవారం మైనర్ బాలిక.. తన మైనర్ ప్రియుడినిక కలిసేందుకు అతని ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో బాలుడు ఇంట్లో లేదు. అతని తండ్రి, accussed ఇంట్లో ఉన్నాడు. బాలికకు కొడుకు ఇంట్లో లేడని చెప్పిన నిందితుడు.. ఆమె మీద కన్నేశాడు. ఈ క్రమంలో తన కొడుకు బయటకు వెళ్లాడని.. తిరిగి రావడానికి సమయం పడుతుందని.. ఆ వ్యక్తి బాలికకు చెప్పాడు.

లవర్ ఖర్చుల కోసం కిడ్నాప్ డ్రామా.. కన్నతండ్రికే ఫోన్ చేసి డబ్బులు డిమాండ్... ఓ ఇంటర్ స్టూడెంట్ స్కెచ్...

కాసేపట్లో తిరిగి వస్తాడు కాబట్టి.. ఇంట్లోనే ఉండి కాసేపు ఎదురుచూడమని చెప్పాడు. తండ్రి వయసున్న అతని మాటలు నమ్మిన బాలిక,  సాయంత్రం కూడా కావడంతో ఇక అక్కడే ఉంది. ఇదే అదనుగా భావించిన నిందితుడు చంద్రు బాలికపై బలవంతంగా Sexual assaultకి పాల్పడ్డాడు.

ఈ ఘటనతో షాక్ అయిన బాధిత బాలిక.. ఆ తరువాత ఇంటికి పరుగెత్తుకెళ్లింది. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లి నిందితుడిపై బాలెహోమ్మూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  పోలీసులు నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఢిల్లీ దళిత బాలికపై సామూహిక అత్యాచారం కేసు.. చిన్నారి దుస్తులపై వీర్యం ఆనవాళ్లు లేవు...

దొంగతనానికి వచ్చి అత్యాచారం....

దొడ్డ బళ్లాపురం పరిధిలోని రాజానుకుంట వద్ద అద్దిగానహళ్లి గ్రామంలో జూన్ 8వ తేదీ తెల్లవారు జామున ఒక కార్పెంటర్ ఇంట్లోకి నలుగురు దొంగలు చొరబడ్డారు. ఇంట్లో వారిని బెదిరించి రూ.10వేల నగదు, కొంత బంగారం దోచుకున్నారు. 

అంతటితో ఊరుకోకుండా.. కామంతో కళ్లు మూసుకుపోయిన చోరులు ఇంట్లో ఉన్న యువతులపై Sexual assaultకి ప్రయత్నించారు. అయితే, వారు గట్టిగా కేకలు వేయడంతో పరారయ్యారు. విచారణ జరిపిన పోలీసులు ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు. వారినుంచి రూ.7 లక్షల విలువైన 151 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios