Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ దళిత బాలికపై సామూహిక అత్యాచారం కేసు.. చిన్నారి దుస్తులపై వీర్యం ఆనవాళ్లు లేవు...

స్మశానంలో నీళ్ల కోసం వెళ్లిన బాలికపై దుండగులు సామూహిక అత్యాచారం చేసి హతమార్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

9-year-old girl s rape and murder in Delhi mystery
Author
Hyderabad, First Published Nov 11, 2021, 10:17 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ :  దేశ రాజధాని ఢిల్లీలో తొమ్మిదేళ్ల బాలికపై gang rape, murder కేసులో పోలీసులు సెషన్స్ కోర్టులో  చార్జిషీట్ దాఖలు చేశారు.  నలుగురు నిందితుల  దుస్తులపై,  బాధితురాలి దుస్తులపై వీర్యం ఆనవాళ్లేవీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ టెస్టుల్లో బయటపడలేదని పేర్కొన్నారు.  అలాగే నిందితుల దుస్తులపై,  ఘటనా స్థలంలో వారి గది లో లభించిన  బెడ్ షీట్ పై  బాలిక రక్తం మరకలు లేవని తేలినట్లు వెల్లడించారు.

ఈ మేరకు Forensic Science Lab Test నివేదికను ఛార్జిషీట్ తో జత చేశారు. ఈ ఏడాది ఆగస్టులో ఢిల్లీలో దళిత బాలికపై అత్యాచారం, హత్య వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.  స్మశానంలో నీళ్ల కోసం వెళ్లిన బాలికపై దుండగులు సామూహిక అత్యాచారం చేసి హతమార్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ కేసులో స్మశానంలో గుడి పూజారి  రాదే శ్యాం (55),  Cemetery సిబ్బంది కుల్దీప్ సింగ్,  సలీం మహమ్మద్,  లక్ష్మీనారాయణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు వారిపై pocso actతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండానే బాలిక మృతదేహాన్ని దహనం చేశారని తల్లి ఆరోపించారు. 

ఇదిలా ఉండగా.. గత ఆగస్ట్ 2న దేశ రాజధాని ఢిల్లీలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ తరువాత ఆమె మృతదేహాన్ని బలవంతంగా కాల్చేశారు. ఈ కేసులో ఓ పూజారితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో తమకు న్యాయం చేయాలంటూ స్థానికులు ఆ నిరసన చేపట్టారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన ఆ చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలోని పురానా నంగల్‌ శ్మశానవాటికకు సమీపంలో నివసిస్తోంది.

నిన్న సాయంత్రం శ్మశానవాటిక లోని కూలర్ నుంచి మంచినీళ్లు తీసుకురావడానికి శ్మశానవాటికకు వెళ్లింది.. కానీ తిరిగి రాలేదు. సాయంత్రం 6 గంటల సమయంలో, శ్మశానవాటిక పూజారి రాధేశ్యామ్ కు తెలిసిన కొందరు స్థానికులు.. చిన్నారి తల్లిని శ్మశానవాటికకు పిలిచారు. అక్కడ ఆ చిన్నారి dead bodyని చూపించారు.

ఆ చిన్నారి కూలర్ నీళ్లు తాగుతుండగా current shock కొట్టిందని వాళ్లు తల్లికి చెప్పారు. అయితే చిన్నారి మణికట్టు, మోచేయిపై Burn marks ఉన్నాయి. ఆమె పెదవులు కూడా నీలం రంగులో ఉన్నాయని ఆమె తల్లి చెబుతోంది.

తొమ్మిదేళ్ల బాలికపై హత్యాచారం : నిందితులను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ఢిల్లీ కోర్టు

పూజారి, అతని సహచరులు ఈ విషయం మీద పోలీసులకు సమాచారం ఇవ్వవద్దని బాలిక తల్లికి చెప్పారు. కేసు నమోదు చేస్తే Postmortem పేరుతో పిల్లల అవయవాలు చోరీ చేస్తారని వారు ఆమె తల్లిని భయపెట్టారు. అంతేకాదు వెంటనే అంత్యక్రియలు నిర్వహించాలని సూచించారు.

దీనికి తల్లి ఒప్పుకోవడంతో వారు విజయం సాధించారు. అయితే తల్లికి కొంత  డబ్బులు కూడా ఇచ్చి ఉంటారని స్థానికంగా ఊహాగానాలు వెలువడ్డాయి. అనుమానం వచ్చిన తల్లి.. తన భర్తతో కలిసి ఈ ఘటన మీద యుద్ధానికి తెరలేపింది. పాత నంగల్ గ్రామానికి చెందిన సుమారు 200 మంది  శ్మశానవాటిక వద్ద గుమిగూడారు. పోలీసులకు సమాచారం అందించారు.

నైట్ వెస్ట్ జిల్లా పోలీసు సీనియర్ అధికారి ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ, రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తమకు ఈ కేసు గురించి కాల్ వచ్చిందని చెప్పారు. నిందితుల మీద పిల్లల లైంగిక వేధింపులు, షెడ్యూల్డ్ కులాలు, తెగలపై నేరాలపై కఠినమైన చట్టాల కింద అభియోగాలు నమోదు చేయబడ్డాయని తెలిపారు. విచారణ కొనసాగుతోందన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios