Asianet News TeluguAsianet News Telugu

లవర్ ఖర్చుల కోసం కిడ్నాప్ డ్రామా.. కన్నతండ్రికే ఫోన్ చేసి డబ్బులు డిమాండ్... ఓ ఇంటర్ స్టూడెంట్ స్కెచ్...

పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థి తన లవర్ ఖర్చుల కోసం కిడ్నాప్ డ్రామా అల్లుకున్నాడని పోలీసులు బుధవారం తెలిపారు. వాయిస్ మార్చే యాప్ డౌన్లోడ్ చేసుకుని.. కొడుకును kidnap చేశామంటూ.. తన తండ్రికి ఫోన్ చేసి రెండున్నర లక్షలు డిమాండ్ చేశాడని తెలిపారు.

To meet girlfriend's expense, teen plans own abduction story, demands ransom from father in Madhya Pradesh
Author
Hyderabad, First Published Nov 11, 2021, 1:31 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

లవర్ ఖర్చుల కోసం ఓ యువకుడు ప్లాన్ వేశాడు కిడ్నాప్ తల్లిదండ్రులకు రెండున్నర లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు పోలీసులు రంగంలోకి దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ షాకింగ్ సంఘటన భింద్ జిల్లాలోని గోహద్ పట్టణంలో వెలుగులోకి వచ్చింది.

పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థి తన లవర్ ఖర్చుల కోసం కిడ్నాప్ డ్రామా అల్లుకున్నాడని పోలీసులు బుధవారం తెలిపారు. వాయిస్ మార్చే యాప్ డౌన్లోడ్ చేసుకుని.. కొడుకును kidnap చేశామంటూ.. తన తండ్రికి ఫోన్ చేసి రెండున్నర లక్షలు డిమాండ్ చేశాడని తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సురేంద్ర కుష్వాహా కుమారుడు సందీప్ కుష్వా (18)  నవంబర్ 6వ తేదీన కనిపించకుండా పోయాడు. ఎంత వెతికినా కుమారుడి ఆచూకీ లభించకపోవడంతో సురేంద్ర స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కుమారుడి మొబైల్ నుంచి ఈ నెల 8న ఫోన్ రావడంతో సురేంద్ర మళ్లీ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు Mobile signal ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

ఫోన్ వచ్చిన లొకేషన్ ఆధారంగా లోని ఓ ప్రాంతంలో దాడులు నిర్వహించి పోలీసులు Sandeep Kushwaను సురక్షితంగా పట్టుకున్నారు.  సందీప్ ను అదుపులోకి తీసుకున్న అనంతరం  పోలీసులు విచారించగా..  అతను చెప్పిన విషయం విని షాకయ్యారు.  తన లవర్ ని కలవడానికి  gurugram వెళ్లాలి అనుకున్నాను అని.. అందుకు డబ్బులు కావాల్సి ఉందని తెలిపాడు. 

కార్పెంటర్ ఇంట్లో దొంగతనానికి వచ్చి.. కామంతో యువతులపై లైంగిక దాడికి యత్నం..

అందుకే కిడ్నాప్ డ్రామా ఆడినట్లు యువకుడు వెల్లడించాడు.  కాగా యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని  పోలీస్ స్టేషన్  ఇంచార్జ్  గోపాల్ సింగ్ Sikarwar తెలిపారు.  ముందు డబ్బులు అడిగితే కుటుంబ సభ్యులు ఇవ్వలేదని దీంతో ఈ ప్లాన్ వేసినట్లు తెలిపాడు. కాగా బెదిరింపు కాల్ చేసే ముందు 
Voice application సరిగా పని చేస్తుందో, లేదో తనిఖీ చేయడానికి ముందు తన స్నేహితురాలికి ఫోన్ చేసినట్లు పోలీసులకు చెప్పడంతో వారు షాక్ అయ్యారు. 

బాలిక కిడ్నాప్, లైంగికదాడి.. జైలు..
ఇదిలా ఉండగా.. బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి నవంబర్ 8, సోమవారం కోర్టు 20 యేళ్లు జైలు శిక్ష విధించింది. పెదకాకాని పోలీసుల కథనం ప్రకారం... పెదకాకాని ప్రాంతానికి చెందిన బాలిక 8వ తరగతి చదువుతోంది. 

పాఠశాలకు వెళుతున్న ఆ బాలికను ఆటో డ్రైవర్ సాగర్ బాబు మాయమాటలు చెప్పి 2015 డిసెంబర్ 15న ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. బాలిక ఇంటికి రాకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

నిందితుడు సాగర్ బాబుతో పాటు అతడికి సహకరించిన వేల్పుల కిషోర్ బాబు, కొండేటి శ్రీనివాసరావు, రాణిలపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. 

బాలిక మీద ఆటో డ్రైవర్ లైంగిక దాడి చేసినట్టు నిర్థారణ కావడంతో నిందితుడు సాగర్ బాబుకు గుంటూరులోని Pocso Special Court జడ్జి ఆర్.శ్రీలత 20యేళ్లు Imprisonmentతో పాటు... రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన ముగ్గురి మీద నేరం రుజువు కానందున వారిమీద కేసు కొట్టేసినట్టు తెలిపారు. కేసులో పీపీగా శ్యామల వాదనలు వినిపించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios