తిరువనంతపురం: భర్త శవంతో ఓ వివాహిత జాగారం చేసింది ఓ మహిళ. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

కేరళ రాష్ట్రంలోని అలువా ప్రాంతంలో లిస్సి తన భర్తతో నివాసం ఉంటుంది. భర్త జోషికి 67 ఏళ్లు. లిస్సికి క్యాన్సర్ వ్యాధి ఉంది. వీరి పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు. 

లిస్సితో కలిసి అలువలో నివాసం ఉంటున్నారు. బుధవారం  నాడు లిస్సి క్యాన్సర్ చికిత్స కోసం ఆమె ఆసుపత్రికి వెళ్లింది. కిమియోథెరపి చేయించుకొని ఇంటికి వచ్చిన  తర్వాత రాత్రి ఇంటికి వచ్చింది. అప్పటికే భర్త జోషి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.

భర్త ఆత్మహత్య చేసుకొన్న విషయాన్ని చూసి ఆమె ఇరుగు పొరుగు వారికి సమాచారం ఇచ్చింది. పోలీసులు సంఘటన స్థలంలో ఫార్మాలిటీస్ పూర్తి చేసేందుకు వచ్చారు. అయితే అప్పటికే  రాత్రి అయింది.  తమ నిబంధనల ప్రకారంగా ఉదయం పూటే ఫార్మాలిటీస్ ను పూర్తి చేస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో భర్త శవంతో గడిపింది.

మరుసటి రోజు ఉదయం వరకు భర్త శవంతో ఆమె రాత్రంతా గడపాల్సి వచ్చింది. పోలీసులు మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.