ప్రియుడితో ఏకాంతంగా ఉండడం తండ్రి చూశాడని ఓ బాలిక అవమానంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులోని చెన్నైలో వెలుగు చూసింది. 

తమిళనాడు : తమిళనాడులోని చెన్నైలో ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. చెన్నైలోని ఈరోడ్ జిల్లా కరంగాళ్ పాలెం కు చెందిన పదవ తరగతి బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఇటీవలే ఆమె టెన్త్ సప్లమెంటరీ ఎగ్జామ్స్ రాసింది. ఆమె తండ్రి కరంగాళ్ పాలయం కు చెందిన టైలర్. రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉండడంతో ఇంట్లోనే ఉంటుంది. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన బాయ్ఫ్రెండ్ ను ఇంటికి పిలిపించుకుంది.

వారిద్దరూ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో తండ్రి వచ్చాడు. వారిద్దరూ సన్నిహితంగా ఉండడాన్ని చూశాడు. తండ్రిని చూసిన ప్రియుడు వెంటనే అక్కడి నుంచి ప్రాణభయంతో పారిపోయాడు. తండ్రి కూతురిని తీవ్రంగా హెచ్చరిక హెచ్చరించాడు. దీంతో ఆమె అవమానాన్ని తట్టుకోలేకపోయింది. తమ సన్నిహితంగా ఉండడం తండ్రి చూశాడు అన్న అవమాన భారంతో ఇంట్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. దీనిమీద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

బెంగళూరులో మహిళా టెక్కీ హత్య.. హైదరాబాద్ లో నివసించే మాజీ ప్రియుడిని హత్య చేసిన పోలీసులు..

ఇదిలా ఉండగా, హైదరాబాద్ శివార్లలో బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. బాలికను ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోకి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేశారు దుండగులు. దీంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. వారినుంచి తప్పించుకున్న బాలిక రోడ్డు మీదికి వచ్చి ఏడుస్తూ సహయం కోసం అర్ధించింది. అటుగా వెడుతున్న ఓ హిజ్రా బాలికను చూసి.. రక్షించి.. పోలీసులకు అప్పగించింది. 

ఈ కిడ్నాప్, అత్యాచారయత్నం కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అడ్రస్ చెప్పాలంటూ బాలికను అడిగి.. మత్తుమందు స్ప్రే చేశారు. ఆ తరువాత బాలికను తీసుకుని ఔటర్ రింగ్ రోడ్డు మీదికి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశారు. నోరుమూసి బాలికను ఎత్తుకెళ్లారు. పొదల్లోకి తీసుకెళ్లి దాడికి ప్రయత్నించగా.. ప్రతిఘటించింది. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. ఎలాగో వారినుంచి తప్పించుకుని రోడ్డు మీదికి పరిగెత్తింది.

అక్కడ కనిపించినవారిని సహాయం అడిగింది. ఎవ్వరూ బాలిక గోడును పట్టించుకోలేదు. అటుగా వెడుతున్న ఓ హిజ్రా బాలిక ఏడుస్తూ, గాయాలతో ఉండడాన్ని గమనించి.. ఏం జరిగిందని అడిగింది. మా వాళ్లకు ఫోన్ చేయమంటూ అడిగింది. ఆమె చెప్పిన నెంబర్ కు కాల్ చేసి.. మాట్లాడించింది.

హిజ్రా ఏం చెబుతోందంటే...‘బాలిక ఏడుస్తూ ఉండడం చూసి.. ఏమైంది.. ఇక్కడెందుకున్నావ్ అని అడిగాను. తనను ఎవరో ఎత్తుకొచ్చారని చెప్పింది. వాళ్లనుంచి తప్పించుకుని వచ్చానని.. చాలామందిని ఫోన్ చేయమని అడిగినా చేయలేదని చెప్పింది. నేను ఆమె చెప్పిన నెంబర్ కు ఫోన్ చేశాను. ఆ చిన్నారిని అడ్రస్ అడిగి.. చెబుతుంటే మత్తుమందు స్ప్రే చేసి.. బండిమీద ఇక్కడికి తీసుకువచ్చారని చెప్పింది.. వెంటనే నేను పోలీసులకు కూడా సమాచారం ఇచ్చాను.’ అని చెప్పుకొచ్చింది. 

అక్కడికి చేరుకున్న పోలీసులు, బంధువులు బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధిత బాలిక చెప్పిన వివరాల ప్రకారం నిందితుల కోసం గాలింపు చేపట్టారు.