Asianet News TeluguAsianet News Telugu

Kashmir Encounter : జమ్ముకశ్మీర్ లో ఎన్ కౌంటర్..ఉగ్రవాది హతం..

Kashmir Encounter :  జమ్ముకశ్మీర్​లో వ‌రుస‌గా ఉగ్ర‌దాడులు జ‌రుగుతున్నాయి. కాశ్మీర్ లోయలో  భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. శనివారం సాయంత్రం నార్త్ కశ్మీర్ జిల్లా అయిన కుప్వారాలోని జుమాగుండ్ ఏరియాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంట‌ర్ జ‌రిగింది. 
 

Militant Killed In Encounter In North Kashmirs Kupwara Police
Author
Hyderabad, First Published Jan 2, 2022, 12:13 AM IST

Kashmir Encounter :  జమ్మూ కాశ్మీర్ లో వ‌రుస‌గా ఉగ్ర‌దాడులు జ‌రుగుతున్నాయి. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులు తమ దుర్మార్గపు కుట్రలను కొనసాగిస్తూ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుంటూ దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్ర‌మంలో గ‌త వారం రోజులుగా పాక్ - భార‌త్ స‌రిహ‌ద్దులో ఏదొక చోట ఉగ్ర‌వాదులు కాల్పుల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా  జమ్ముకశ్మీర్​లో మ‌రో ఉగ్ర‌దాడి జరిగింది. శనివారం సాయంత్రం నార్త్ కశ్మీర్ జిల్లా అయిన కుప్వారాలోని జుమాగుండ్ ఏరియాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో  ఉగ్ర‌దాడుల్లో ఓ ఉగ్రవాది హతమైనట్లు పోలీసులు తెలిపారు. 
  
ఆర్మీ ఆధికారుల వివ‌రాల ప్ర‌కారం..   శనివారం సాయంత్రం నార్త్ కశ్మీర్ జిల్లా అయిన కుప్వారాలోని జుమాగుండ్ ఏరియాలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్క సమాచారంతో కూంబింగ్ నిర్వహించారు. ఈ క్ర‌మంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ గుర్తు తెలియని ఉగ్రవాదిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారని కశ్మీర్ జోన్ పోలీసులు ట్విట్టర్ ద్వారా తెలిపారు.  

Read also: New Year 2022 : న్యూఇయర్ విషెస్ చెబుతూ.. చైనా, పాక్ సైనికులకు మిఠాయిలు పంచిన భారత జవాన్లు

అలాగే.. జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో భార‌త సైన్యం మ‌రో ఆపరేషన్ నిర్వ‌హించింది. ఈ ఆపరేష‌న్లో  ఉగ్రవాదుల స్థావరాన్ని ఛేదించారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆప‌రేష‌న్ ను  భారత సైన్యం,  జమ్మూ కాశ్మీర్ పోలీసుల సంయుక్తంగా నిర్వ‌హించిన‌ట్టు ఆర్మీ ఆధికారులు తెలిపారు. గత రెండు రోజుల్లో ఉగ్ర‌వాదుల‌కు సంబంధించిన‌ నాలుగు ర‌హ‌స్య స్థావ‌రాలను భద్రతా బలగాలు ఛేదించారు. ఘటన స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందు గుండు సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

క్ర‌మంగా కాశ్మీర్ లోయ‌లో ఉగ్ర‌వాదులు గాల్పుల‌కు పాల్ప‌డుతూ.. భార‌త భూ భాగంలోకి చొర‌బ‌డుతున్నారు.  దీంతో  భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ క్ర‌మంలోనే గ‌త నాలుగు రోజుల కిత్రం రెండు వేరువేరు ఎన్ కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు మ‌ర‌ణించారు. ఆ ఘటనను మరవకు ముందే శ్రీనగర్‌లోని పాంథా చౌక్ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. నలుగురు జవాన్లు గాయపడ్డారు. జమ్మూకాశ్మీర్ పోలీసులు, సీఆర్ఫీఎఫ్ బలగాలు ఉమ్మడిగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి.   

Read also: రాజస్థాన్‌: ఇండో పాక్ బోర్డర్‌‌లో కుప్పకూలిన మిగ్‌ 21 ఫైటర్ జెట్ .. రంగంలోకి ఎయిర్‌ఫోర్స్

అలాగే..  శ్రీనగర్‌లోని పాంథా చౌక్‌లో పోలీసు బస్సుపై దాడికి పాల్పడిన తొమ్మిది మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి.  డిసెంబరు 13వ తేదీన శ్రీనగర్ శివార్లలో ఒక పోలీసు బస్సుపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశార‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఒక అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్‌తో పాటు మ‌రో ముగ్గురు పోలీసులు మరణించ‌గా.. మ‌రో 11 మంది పోలీసు సిబ్బంది గాయ‌ప‌డ్డారు.  ఈ దాడిలో పాల్గొన్న ఒకరిని పాకిస్తాన్‌కు చెందిన తీవ్రవాద సంస్థ  జైష్-ఎ-మొహమ్మద్ (JeM)కి చెందిన  సుహైల్ అహ్మద్ రాథర్‌గా గుర్తించారు. అలాగే ఈ దాడిలో ఒక పోలీసుకు గాయాల‌య్యాయ‌ని చెప్పారు.
  2021లో 44 మంది మోస్ట్ వాంటెండ్ టెర్రరిస్టులు హతం

గ‌తేడాది 2021 లో  మొత్తంలో జ‌మ్మూకాశ్మీర్‌లో 100 కూబింగ్లు నిర్వ‌హించామ‌ని జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. ఆ కూబింగ్ లో 44 మంది మోస్ట్ వాంటెండ్ టెర్ర‌రిస్టుల‌ను హ‌త‌మార్చిన‌ట్టు పేర్కొన్నారు.  ఈ ఏడాది 34 మంది ఉగ్రవాదులు మాత్ర‌మే చొరబాటుకు పాల్పడ్డారని చెప్పారు. ఈ ఏడాది జ‌మ్మూకాశ్మీర్‌లో 80 మంది ఉగ్రవాదులను అరెస్టు చేశామ‌ని, 497 మందిపై UAPA చ‌ట్టం కింద నమోదు చేశామ‌ని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios