నూతన సంవత్సరం సందర్భంగా భారత్‌, పాకిస్థాన్‌ సైనికులు (indo pak border) సరిహద్దుల్లో పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (lion of control) వద్ద ఉన్న మెంధార్‌ హాట్‌ స్ప్రింగ్స్, పూంచ్‌ రావల్‌ కోట్‌, చకోటి ఉరి, చిల్లియానా తివాల్‌ క్రాసింగ్‌ పాయింట్ల వద్ద మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్నారు. 

నూతన సంవత్సరం సందర్భంగా భారత్‌, పాకిస్థాన్‌ సైనికులు (indo pak border) సరిహద్దుల్లో పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (lion of control) వద్ద ఉన్న మెంధార్‌ హాట్‌ స్ప్రింగ్స్, పూంచ్‌ రావల్‌ కోట్‌, చకోటి ఉరి, చిల్లియానా తివాల్‌ క్రాసింగ్‌ పాయింట్ల వద్ద మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్నారు. పరస్పరం కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. 

అటు సరిహద్దుల్లో తీవ్ర ప్రతిష్టంభన ఉన్నప్పటికీ.. నూతన సంవత్సరం సందర్భంగా భారత్​, చైనా సైనికులు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి.. హాట్​ స్ప్రింగ్స్​, డెమ్​ చోక్​, నాథులా, కోంగ్రా లా ప్రాంతాల్లో పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీ(పీఎల్​ఏ), భారత సైనికులు పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. 

తూర్పు లద్దాఖ్​లో (east ladakh) ఇరు దేశాల మధ్య 18 నెలల ప్రతిష్టంభన నడుమ.. స్వీట్లు పంచుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2020 మే 5న ఇరుదేశ సైన్యం మధ్య హింసాత్మక ఘర్షణ తర్వాత.. సంబంధాలు మరింత క్షీణించాయి. సరిహద్దుల్లో పరస్పరం వేలాది మంది సైనికులను మోహరించాయి. 13 దఫాలు అత్యున్నత స్థాయి సైనిక చర్చలు జరిగాయి.

ఇకపోతే జమ్ముకశ్మీర్​ కుప్వారాలో భారత బలగాలు.. దేశ ప్రజలకు వినూత్నంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాయి. నియంత్రణ రేఖ వెంట ఫార్వర్డ్​ ప్రాంతంలోకి జాతీయ జెండాను ప్రతిష్ఠించి.. భారత్​ మాతా కీ జై అని నినాదాలు చేశారు సైనికులు.