200 మంది మహిళల ఫొటోలు తీసి, అశ్లీలంగా మార్చిన ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ ఉద్యోగి.. తరువాత ఏం జరిగిందంటే ?
అతడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. గ్రామంలో కూలీలతో పనులు చేయించడం, వారి అటెండెన్స్ తీసుకోవడం, కూలీ డబ్బులు ఇప్పించడం అతడి పని. కానీ అతడు అటెండెన్స్ కోసం తీసుకున్న మహిళల ఫొటోలను మార్పింగ్ చేసి, అశ్లీలంగా మార్చుకున్నాడు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉద్యోగిగా పని చేస్తున్న యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. అటెండెన్స్ కోసం అని దాదాపు 200 మంది ఫొటోలు తీసి, వాటిని మార్ఫింగ్ చేశాడు. అశ్లీలంగా మార్చుకొని తన ఫోన్ లో భద్రపర్చుకున్నాడు. అయితే వీటిని మరో ఉద్యోగి చూడటంతో అతడి దుశ్చర్య వెలుగులోకి వచ్చింది.
పిడుగుల వాన బీభత్సం.. ఆదిలాబాద్ లో ముగ్గురు, ములుగులో ఒకరు మృతి.. పలు మూగ జీవాల మృత్యువాత
వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులోని కళ్లకుర్చి జిల్లాలోని వీరచోళాపుం గ్రామంలో 27 ఏళ్ల వసంత్ నివసిస్తున్నాడు. అతడు ఉపాధి హామీ పథకంలో ఉద్యోగిగా సేవలు అందిస్తున్నాడు. అయితే ఈ పథకంలో పని చేసే మహిళను అటెండెన్స్ కారణం చెప్పి ఫొటోలు తీశాడు. అనంతరం అందులో సుమారు 200 మంది మహిళల ఫొటోలను మార్పింగ్ చేసి, అశ్లీలంగా తయారు చేశాడు. తరువాత వాటిని తన సెల్ ఫోన్ లో సేవ్ చేసుకున్నాడు.
ఫేక్ మెసేజ్ కు భయపడి స్టూడెంట్ ఆత్మహత్య.. ఇంతకీ దానిని ఎవరు పంపించారు..? అందులో ఏముందంటే ?
కాగా.. కొన్ని రోజుల కిందట ఆ గ్రామంలో పని చేసే మరో ఉద్యోగి ఆఫీసు పనుల కోసం వసంత్ సెల్ ఫోన్ తీసుకున్నాడు. అయితే ఆ ఫోన్ ను తెరిచి చూడటంతో వసంత్ చేసిన బాగోతం మొత్తం బయటపడింది. ఆ మహిళ మార్పింగ్ ఫొటోలు చూసి అతడు షాక్ కు గురయ్యాడు. దీనిపై దినేష్ కుమార్ త్యాగదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వసంత్ పై ఫిర్యాదు చేశాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ ఫొటోలను వసంత్ దుర్వినియోగం చేసుకున్నాడా ? లేదా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై ఆ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.