ముంబయి పోలీసులను పరుగుపెట్టించిన మతిస్థిమితంలేని మహిళ.. 38 సార్లు ఫేక్ బాంబ్ కాల్స్
ముంబయిలోని ఓ మతిస్థిమితం లేని మహిళ పోలీసులను పరుగులు పెట్టించింది. బాంబు ఉన్నట్టు కొన్ని ఏరియాల పేర్లు చెబుతూ వారిని హైరానా పెట్టింది. తీరా వాళ్లు స్పాట్‌కు వెళ్లి తనిఖీలు చేస్తే ఆ కాలర్ ఇచ్చిన సమాచారం అవాస్తవమని తేలడం ఇలా చాలా సార్లు ముంబయి పోలీసులకు జరిగింది. కాలర్ వివరాలు చెక్ చేస్తే.. ఆ మహిళ గతంలో 38 సార్లు ఫోన్ చేసి ఇలాగే అవాస్తవ సమాచారం చెప్పినందుకు పోలీసులు చాలా ఏరియాల్లో తనిఖీలు నిర్వహించి అవాస్తవమనే నిర్దారణకు వచ్చారని తేలింది.

ముంబయి: మతిస్థిమితం లేని ఓ మహిళ ముంబయి పోలీసులను పరుగుపెట్టించింది. బాంబ్ లేకున్నా.. ముంబయి పోలీసులకు ఫోన్ చేసింది. తాజాగా ఆమె ఫోన్ చేసిన తర్వాత నిజంగానే బాంబ్ పెట్టారేమోననే భయంతో పోలీసులు తనిఖీల కోసం వెంటనే స్పాట్‌కు వెళ్లారు. కానీ, అక్కడ బాంబ్ లేదు. ఆ కాలర్ అబద్ధం చెప్పారని పోలీసులకు అర్థమైంది. అదే నెంబర్ పరిశీలిస్తే.. ఆ నెంబర్ నుంచి గతంలోనూ 38 సార్లు ఇలా నకిలీ బాంబ్ కాల్స్ వచ్చాయని గుర్తించారు. తీరా కాలర్ వివరాలు తెలుసుకోగా.. ఆమె మతిస్థిమితం లేని మహిళ అని తెలిసింది.
ముంబయి పోలీసు కంట్రోల్ రూమ్‌కు మంగళవారం ఓ కాల్ వచ్చింది. నేపియన్ సీ రోడ్‌లో బాంబు పెట్టినట్టు సమాచారం. పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. నేపియన్ సీ రోడ్‌లో బాంబు తనిఖీలు చేశారు. కానీ, దొరకలేదు. ఆ తర్వాత ఫోన్ నెంబర్ చూసి వివరాలు సేకరించగా.. ఓ మతిస్థిమితం లేని మహిళ ఆ ఫోన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాదు, గతంలో 38 సార్లు ఫోన్ చేసి వేర్వేరు ఏరియాలకు పోలీసులను పరుగులు పెట్టించినట్టు కనుగొన్నారు.
Also Read: పరిహారం పెంచిన తర్వాత రైతుల ఆత్మహత్యలు పెరిగాయి: కర్ణాటక మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
మరో బాంబ్ బెదిరింపు కాల్ కూడా ముంబయి పోలీసులకు వచ్చింది. దక్షిణ ముంబయిలోని కామటిపుర ఏరియాలో బాంబు ఉన్నట్టు కాల్ వచ్చింది. కానీ, అది కూడా ఫేక్ అనే తేలింది. ఇటీవలి కాలంలో ముంబయి పోలీసులకు 26/11 స్టైల్‌లో చాలా కాల్స్ వచ్చాయి. మంత్రాలయ, పోలీసు హెడ్ క్వార్టర్స్, ఎయిర్‌పోర్టులు, రైల్వేస్, సబర్బన్ ట్రైన్స్, ప్రామినెంట్ లొకేషన్స్ మొదలైన ఏరియాల్లో బాంబులు పెట్టినట్టు ఫోన్ కాల్స్ వచ్చాయి. కానీ, అవన్నీ అవాస్తవాలేనని ఆ తర్వాత తెలియవచ్చింది.