మగవారు తమ మన్సులను దృఢం చేసుకోవాలని, మహిళలను హిజాబ్ ధరించడం నుంచి విముక్తుల్ని చేయాలని హర్యానా మంత్రి అనిల్ విజ్ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు.
పురుషులు తమ మనస్సులను దృఢపరచుకోవాలని, మహిళలను హిజాబ్ నుండి విముక్తి చేయాలని హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ అన్నారు. మహిళలు హిజాబ్ ధరించడంపై గురువారం విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేయడానికి నిరాకరిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు అస్పష్టమైన తీర్పును వెలువరించడానికి కొంత సమయానికి ముందు అనిల్ విజ్ ట్వీట్ చేశారు.
తమిళనాడులో ట్రాన్స్‌జెండర్లపై దాష్టీకం.. జుట్టు కత్తిరించి వేధింపులు.. వ్యభిచారానికీ బలవంతం (వీడియో)
అందులో ‘‘మహిళలను చూడగానే ఉద్వేగాన్ని అదుపు చేసుకోలేని పురుషులు స్త్రీలను హిజాబ్ ధరించమని బలవంతం చేశారు. ఇక్క వారి మనస్సును దృఢపరచుకోవడం అవసరం. కానీ స్త్రీలకు శిక్ష పడింది. వారు తల నుండి కాలి వరకు కప్పబడ్డారు. ఇది తీవ్ర అన్యాయం.’’ అని ఆయన పేర్కొన్నారు.
అదే ట్వీట్‌లో “ పురుషులు తమ మనస్సులను దృఢపరచుకోవాలి. మహిళలను హిజాబ్ నుండి విముక్తి చేయాలి” అని సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో ప్రస్తుత డ్రెస్ కోడ్‌ను తప్పనిసరిగా పాటించాలని ఆయన అన్నారు.
2021 అక్టోబర్ లో ఉడిపిలోని కాలేజీలో ఈ హిజాబ్ వివాదం ప్రారంభమైంది. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ఈ వివాదం పాకింది. యూనిఫాం తప్పనిసరిగా ధరించి రావాలని విద్యాసంస్థ చేసిన సూచనను పాటించలేదు. హిజాబ్ ధరించి కొందరు విద్యార్ధినులు వచ్చారు. దీంతో వివాదం ప్రారంభమైంది. యూనిఫాం లేకుండా వచ్చిన ఆరుగురు విద్యార్ధినులను క్లాస్ రూమ్ లోకి అనుమతించలేదు. విద్యా సంస్థ బయట విద్యార్ధినులు ఆందోళనకు దిగారు. మరోవైపు అదే సమయంలో హిజాబ్ అనుకూలంగా,వ్యతిరేకంగా రాష్ట్రంలో ఆందోళనలు సాగాయి. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించినా కూడా అనుమతివ్వాలని కోరుతూ హైకోర్టులో విద్యార్ధినులు పిటిషన్లు దాఖలు చేశారు.
విద్యార్థులకు సొంత భాషలో పరీక్షలు రాసే హక్కు ఉంటుంది - రాహుల్ గాంధీ..
2022 జనవరి 19న ఉడిపికి చెందినకాలేజీ యాజమాన్యం, విద్యార్ధులు, పేరేంట్స్, అధికారులతో సమావేశం నిర్వహించింది. కానీ ఈ సమావేశంలో ఎలాంటి ఫలితం రాలేద. జనవరి 26న మరోసారి సమావేశం నిర్వహించారు. హిజాబ్ లేకుండా కాలేజీకి రాలేని విద్యార్ధినులు ఆన్ లైన్ లో చదువుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధి చెప్పడంతో వివాదం మరింత ముదిరింది.
టపాసుల అమ్మకాలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎంకె స్టాలిన్ లేఖ.. ఏమన్నారంటే.. ?
ఫిబ్రవరిలో హిజాబ్ ను వ్యతిరేకిస్తూ కొందరు, మద్దతిస్తూ మరి కొందరు విద్యార్ధులు ఆందోళనలకు దిగారు. యూనిఫాం ధరించడాన్ని సవాల్ చేయడంతో పాటు హిజాబ్ ధరించి విద్యా సంస్థల్లోకి అనుమతి కోరుతూ ఉడిపి విద్యార్ధినులు దాఖలుచేసిన పిటిషన్లను కర్ణాటకహైకోర్టు ఈ ఏడాది మార్చి 15న కొట్టివేసింది. దీంతో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈఏడాది సెప్టెంబర్ 22న పిటిషన్లపై న్యాయమూర్తులు హేమంత్ గుప్తా,ధులియా ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది. 10 రోజుల పాటు ఇరువర్గాల వాదలను ఈ ధర్మాసనం వింది.
