న్యూఢిల్లీ: అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్నారు. డోనాల్డ్ ట్రంప్ తో పాటు ఆమె భారత పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శిస్తారు. 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు గుజరాత్ లోని అహ్మదాబాద్ చేరుకుంటారు. నిరుడు సెప్టెంబర్ లో హౌస్టన్ లో ఏర్పాటు చేసిన హౌడీ మోడీ తరహాలో అహ్మదాబాద్ లో మోటెరా స్టేడియంలో నమస్తే ట్రంప్ పేరుతో భారీ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలో పాల్గొనే దాదాపు లక్ష మందిని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తారు.  

Also Read: ట్రంప్ వస్తున్నాడని.. గోడకట్టేసి, బస్తీవాసులను దాచేస్తున్నారు!

ఆ తర్వాత ట్రంప్ ఢిల్లీకి చేరుకుంటారు. ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన చర్చలు జరిపే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం ప్రోటోకాల్ లో భాగంగా రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ నకు స్వాగతం ఉంటుంది. 

Also Read: ట్రంప్ భారత పర్యటన: మినిట్ టూ మినిట్ షెడ్యూల్

సాయంత్రం ట్రంప్ న్యూఢిల్లీలోని అమెరికా ఎంబసీలో జరిగే భారత కంపెనీల ఎగ్జిక్యూటివ్ లతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ట్రంప్ భారత పర్యటనకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.