Asianet News TeluguAsianet News Telugu

పోర్న్ సైట్లపై కేంద్రం కొరడా.. మ‌రో 67 సైట్లు బ్లాక్..

 67 పోర్న్ వెబ్‌సైట్లపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2021లో జారీ చేసిన కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) నిబంధనలను ఉల్లంఘించినందుకు ఇంటర్నెట్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది.

MeitY orders internet companies to block 67 porn websites
Author
First Published Sep 29, 2022, 10:56 PM IST

కేంద్రప్రభుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. పోర్న్ సైట్లపై మరోసారి కొరడా ఝులిపించింది. ఇప్పటికే పలు సైట్లపై నిషేధం విధించిన కేంద్రప్ర‌భుత్వం.. తాజాగా మరో 67 ఫోర్న్ వెబ్‌సైట్లపై నిషేధం విధిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2021లో జారీ చేసిన నూతన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ సైట్లను నిషేధించాలని కోర్టులు ఆదేశాలు జారీ చేశాయి. ఈ  మేరకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. 

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) పూణే కోర్టు ఆర్డర్, ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాలు, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల ఆధారంగా 63 వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయాలని కంపెనీలను కోరింది.

2021లో ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అమలు చేసిన కొత్త ఐటీ నిబంధనలలో..  కంపెనీలు పోర్న్ వంటి కంటెంట్‌ను చూపించకూడదని చెప్పబడింది. కొత్త ఐటీ నిబంధనల ప్రకారం.. కంపెనీలు అలాంటి కంటెంట్‌ను కూడా బ్లాక్ చేయడం తప్పనిసరి.  బ్లాక్ చేయ‌బ‌డిన‌ వెబ్‌సైట్‌ల్లో కొన్ని అశ్లీల విషయాలు ఉన్న‌ట్టు గుర్తించింది. 

2021లో ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అమలు చేసిన కొత్త IT నిబంధనల ప్రకారం.. పూర్తిగా లేదా పాక్షికంగా నగ్నంగా లేదా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడాన్ని సూచించే.. వాటిని  నిల్వ చేసిన లేదా ప్రచురించిన అటువంటి మెటీరియల్ ప్రసారానికి యాక్సెస్‌ను బ్లాక్ చేయడం తప్పనిసరి. నూత‌న‌ ఐటీ నిబంధనల ప్రకారం.. కంపెనీలు అలాంటి కంటెంట్‌ను కూడా బ్లాక్ చేయడం తప్పనిసరి. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ వెబ్‌సైట్‌లు/యూఆర్‌ఎల్‌లను వెంటనే బ్లాక్ చేయమని ఆర్డర్ జారీ చేసింది. గతంలో కూడా వందల సంఖ్యలో పోర్న్ సైట్లను నిషేదిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కానీ కొత్త సైట్లు పుట్టుకొస్తుండటంతో వాటిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది.

Follow Us:
Download App:
  • android
  • ios