Asianet News TeluguAsianet News Telugu

ఉక్రెయిన్ మెడిక‌ల్ విద్యార్థుల‌కు భార‌త్ లో ప్ర‌వేశాలు క‌ల్పించ‌లేం- సుప్రీంకోర్టులో కేంద్రం

ఉక్రెయిన్ నుంచి తరలివచ్చిన వైద్య విద్యార్థులకు భారత్ లో ప్రవేశాలు కల్పించడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కు తెలిపింది. వారి ప్రవేశాలకు నిబంధనలు అనుమతించవని చెప్పింది. 

Medical students of Ukraine cannot be admitted in India.. Center in Supreme Court...
Author
First Published Sep 16, 2022, 5:21 PM IST

ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థుల ప్రవేశం క‌ల్పిస్తే అది వైద్య విద్యపై తీవ్ర ప్రభావం చూపుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) చట్టం- 2019 ప్రకారం ఎలాంటి నిబంధ‌న‌లూ లేనప్పుడు ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు భారతీయ విశ్వవిద్యాలయాలలో వసతి కల్పించలేమని తేల్చి చెప్పింది. అలాంటి వారికి ఏదైనా మినహాయింపు ఇస్తే దేశ వైద్య విద్య ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పేర్కొంది.

Viral video: టోల్ ప్లాజా వద్ద జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు.. గన్స్ కాదు బూట్లు చాలు గురూ.. !

యుద్ధం వ‌ల్ల ఉక్రెయిన్ నుంచి తిరిగి వ‌చ్చిన భార‌తీయ వైద్య విద్యార్థుల‌కు ఇక్క‌డ అడ్మిష‌న్లు క‌ల్పించాల‌ని, అలాగే  వైద్య విద్య‌ను కొన‌సాగించ‌డానికి విద్యా, ఆర్థిక సాయం అందించేలా కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించాల‌ని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్-142 ప్రకారం మార్గదర్శకాలను రూపొందించాలని పిటిషన‌ర్లు కోరారు. 

దీనిపై స్పందిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం త‌న ప్ర‌త్యుత్త‌రాన్ని సుప్రీంకోర్టులో దాఖ‌లు చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్, కేంద్రం ఇప్పటికే ‘‘అభ్యంతరం’’ లేని ఉక్రేనియన్ విశ్వవిద్యాలయాలు ప్రతిపాదించిన అకడమిక్ మొబిలిటీ ప్రోగ్రామ్ ను వారు ఉపయోగించుకోవాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది.

PM CARES Fund: పీఎం కేర్స్ ఫండ్‌పై జనవరి 31న విచారించ‌నున్న ఢిల్లీ హైకోర్టు

‘‘ అకాడమిక్ మొబిలిటీ ప్రోగ్రామ్’’ కు సంబంధించిన ఈ పథకం చాలా మంది బాధిత విద్యార్థులకు న్యాయం చేస్తుందని, యుద్ధంతో అతలాకుతలమైన దేశం నుండి తరలివచ్చిన దాదాపు 20,000 మంది భారతీయ విద్యార్థుల కెరీర్ ను కూడా కాపాడుతుందని సుప్రీంకోర్టుకు తెలిపింది. వైద్య విద్యను అభ్యసించడానికి విద్యార్థులు విదేశాలకు ఎందుకు వెళుతున్నారో ఎత్తిచూపుతూ.. పేలవమైన మెరిట్ ఉన్న విద్యార్థులను భారతదేశంలోని ప్రముఖ వైద్య కళాశాలల్లో ప్రవేశానికి అనుమతి ఇస్తే.. ఈ కళాశాలల్లో సీట్లు పొందలేని అభ్యర్థుల నుండి అనేక వ్యాజ్యాలు రావొచ్చ‌ని కేంద్రం త‌న అఫిడ‌విట్ లో పేర్కొంది. 

భారత్ ను త‌యారీ హబ్‌గా మార్చ‌బోతున్నాం - ఎస్ సీవో స‌మ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోడీ

ఆర్థిక స్థోమత లేని అభ్యర్థులకు భారతదేశంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలను కేటాయిస్తే, వారు మరోసారి సంబంధిత సంస్థల ఫీజు నిర్మాణాన్ని భరించలేకపోవచ్చని కూడా కేంద్రం తెలిపింది. ‘‘అలాంటి విద్యార్థులకు సంబంధించినంత వరకు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 1956 లేదా నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్, 2019 ప్రకారం.. ఏదైనా విదేశీ వైద్య సంస్థల నుంచి విద్యార్థులను భారతీయ వైద్య కళాశాలలకు బదిలీ చేయడానికి నిబంధనలు లేవు. ఇలా ఏ భారతీయ వైద్య సంస్థ విదేశీ వైద్య విద్యార్థులను బదిలీ చేయడానికి లేదా వసతి కల్పించడానికి ఎన్ఎంసీ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అనుమతి ఇవ్వలేదు.’’ అని తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios