భారత్ ను తయారీ హబ్ గా తయారు చేయబోతున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రజలు టెక్నాలజీ వాడకంపై దృష్టి సారిస్తున్నారని చెప్పారు. భారత్ లో ప్రస్తుతం 70 వేల కంటే ఎక్కువ స్టార్టప్ లు ఉన్నాయని తెలిపారు. 

భారతదేశాన్ని తయారీ కేంద్రంగా మారుస్తామ‌ని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ (SCO-CoHS) 22వ సమ్మిట్ లో శుక్ర‌వారం ఆయ‌న ప్ర‌సంగించారు. ‘‘ ప్రజల కేంద్రంగా అభివృద్ధి నమూనాపై దృష్టి సారిస్తున్నాం. మేము ప్రతి రంగంలో ఆవిష్కరణలకు మద్దతు ఇస్తున్నాము. ఈ రోజు మా దేశంలో 70,000 కంటే ఎక్కువ స్టార్టప్‌లు, 100 కంటే ఎక్కువ యునికార్న్‌లు ఉన్నాయి. ’’ అని ఆయన అన్నారు. 

మోడీ పుట్టిన రోజు సందర్భంగా రేపు బంగారు ఉంగరాల పంపిణీ.. ఎక్కడో.. ఎవరికో తెలుసా?

‘‘ భారత ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం 7.5 శాాతం రేటుతో వృద్ధి చెందుతుందని అంచనా. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో మా ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ప్రస్తుతం మా ప్రజలు టెక్నాలజీని ఉప‌యోగించ‌డంపై దృష్టి సారించారు, భారతదేశాన్ని తయారీ కేంద్రంగా మార్చడంలో మేము పురోగతి సాధిస్తున్నాము. ’’ అని ఆయన తెలిపారు. 

Scroll to load tweet…

కోవిడ్ -19 ఉక్రెయిన్ నెలకొన్న పరిస్థితి వల్ల ప్రపంచ సరఫరా గొలుసులో అడ్డంకులు ఏర్పడ్డాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఫలితంగా ఆహారం, ఇంధన భద్రత సంక్షోభం ఏర్పడిందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచం ఆర్థిక పునరుద్ధరణ సవాలును ఎదుర్కొంటోందని తెలిపారు.

Delhi excise policy case: ఈడీ, సీబీఐల తీరుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫైర్

పొరుగు దేశాల మధ్య ఆహార సరఫరాల రవాణా హక్కుల సమస్యను కూడా ప్రధాని ఈ సంద‌ర్భంగా లేవ‌నెత్తారు. పాకిస్తాన్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌కు ట్రాన్స్ పోర్ట్ చేయ‌డానికి భార‌తదేశానికి చాలా నెల‌ల స‌మ‌యం ప‌ట్టింద‌ని అన్నారు. మిల్లెట్‌ను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు, ఆహార భద్రత సవాళ్లను పరిష్కరించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను ప్ర‌దాని నొక్కి చెప్పారు. కోవిడ్ అనంతర కాలంలో SCO కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని అన్నారు. 

Scroll to load tweet…

ఈ స‌మావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ఇతర సభ్య దేశాల నాయకులు హాజ‌ర‌య్యారు. SCO సమ్మిట్ సాధారణంగా 2 సెషన్‌లు ఉంటాయి. మొద‌టి సెష‌న్ SCO సభ్య దేశాలకు మాత్రమే పరిమితం చేస‌తారు. త‌రువాత పరిశీలకులు ప్రత్యేక ఆహ్వానితుల భాగస్వామ్యంతో మ‌రో సెష‌న్ నిర్వ‌హిస్తారు.

చైనా లోన్ యాప్‌లపై ఈడీ కొరడా.. గేట్‌వే ఖాతాల్లో దాచిన రూ. 46 కోట్లు ఫ్రీజ్

కాగా.. అంతకు ముందు ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయెవ్ SCO సమ్మిట్ కోసం హాజ‌రైన ప్ర‌ధాని మోడీకి ఘ‌న స్వాగ‌తం పలికారు. త‌రువాతి SCO సమ్మిట్ కు భార‌త్ అధ్యక్షత వహించబోతోంది. ఇదిలా ఉండ‌గా..ప్ర‌స్తుత స‌మావేశంలో ప్రాంతీయ శాంతి భద్రతలు, వాణిజ్యం, క‌నెక్టివిక్టిటీ, సంస్కృతి, పర్యాటకం వంటి సమయోచిత, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోడీ SCO సభ్య దేశాల నాయకులతో చర్చలు జరుపుతారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.