సారాంశం
Ujjain Mahakaleshwar Temple fire: ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాళేశ్వర ఆలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భారీ పొగ వ్యాపించడంతో దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
Massive fire at Mahakaleshwar Temple in Ujjain: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న ప్రసిద్ధ మహాకాళేశ్వర ఆలయంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆలయ పరిసరాల్లో భారీగా నల్లని పొగలు ఎగిసిపడుతూ కనిపించాయి. ఈ ప్రమాదం ఆలయా ప్రాంతాలను కలవరపరిచింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. అగ్ని, పొగ చాలా త్వరగా ఆలయం అంతటా వ్యాపించాయి. భక్తుల ఆరోగ్యానికి ముప్పు కలగకూడదన్న ఉద్దేశంతో, అధికారులు వెంటనే దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
అగ్నిప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణం ఆలయంలో ఉన్న బ్యాటరీలుగా పలువురు పేర్కొంటున్నారు. అయితే, అగ్నిప్రమాదానికి స్పష్టమైన కారణం ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు.
ఆలయానికి జరిగిన ఆస్తినష్టం ఇంకా లెక్కించలేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రసిద్ధ శైవ క్షేత్రంగా పేరుగాంచిన మహాకాళేశ్వర ఆలయంలో జరిగిన ఈ ఘటన భక్తులలో ఆందోళనకు కారణమైంది. సంబంధిత అధికారులు అప్రమత్తమై, భద్రత చర్యలు ముమ్మరం చేశారు.
ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీలో ఉన్న మహాకాళేశ్వర ఆలయం అనేది పురాణ ప్రాచీనత కలిగిన పవిత్ర శైవక్షేత్రం. ఇక్కడ ఉన్న శివలింగం “స్వయంభూ” పూజిస్తారు. జ్యోతిర్లింగాలలో ఇది ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇది దక్షిణాముఖంగా ఉంటుంది. ఇది భయాలను పారద్రోలే శక్తి పరుణాలు పేర్కొంటున్నాయి. ఉజ్జయినీ పట్టణం క్షిప్ర నదీ తీరంపై ఉంది, ఇది హిందూ మతంలో పవిత్ర నదిగా పరిగణిస్తారు. ఈ ఆలయం తంత్ర, ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా పూజలు నిర్వహించబడే అరుదైన క్షేత్రాలలో ఒకటి.