పెళ్లైన తరువాత మొదటిసారి పుట్టింటికి వచ్చిన వివాహిత.. అత్తింటికని బయలుదేరి అదృశ్యమైన ఘటన హైదరాబాద్ లో జరిగింది.
హైదరాబాద్ : ఓ married woman అదృశ్యమైన ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేట్ కు చెందిన మౌనికకు గతేడాది కొండాపూర్ కు చెందిన ధనుంజయ్ తో వివాహం అయ్యింది. నాటి నుంచి ఆమెను భర్త పుట్టింటికి పంపించలేదు. ఈ క్రమంలో మౌనిక తొమ్మిది రోజుల క్రితం తన బాబాయ్ గోపాల్ ఇంట్లో జరిగిన శుభకార్యానికి భర్తకు చెప్పకుండానే హాజరయ్యింది.
ఈ నెల 3న తన అత్తింటికి వెల్తున్నానని మౌనిక బయలుదేరింది. అదే రోజు సాయంత్రం గోపాల్ ఆమె కోసం ఆరా తీయగా ఇంటికి చేరుకోలేదని తెలిసింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పలు ప్రాంతాల్లో ఆమె జాడ కోసం వెతికినా ఫలితం లేకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే ఏప్రిల్ 4న సంగారెడ్డిలో జరిగింది. ఏమైందో తెలియదు. యేడాదిన్నర చిన్నారిని ఒంటరిగా వదిలేసింది.. వేరే ఊరికి వెళ్లిన భర్త వచ్చేలోపే కనిపించకుండా పోయింది. ఊరినుంచి వచ్చిన ఆ భర్తకు ఇంట్లో చిన్నారి ఒక్కడే ఏడుస్తూ కనిపించడంతో హతాశుడయ్యాడు. భార్య కోసం ఎంతో వెతికాడు. కానీ ఫలితం లేకపోయింది. ఓ వివాహిత సడన్ గా అదృశ్యమైనట్లు సంఘటన sangareddy పట్టణ పరిధిలో చోటుచేసుకుంది. శనివారం సిఐ రమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కిష్టయ్య గూడెంకు చెందిన ఆంజనేయులు, నందిని couple. వీరు పట్టణం పరిధిలోని భవాని నగర్ లో నివాసం ఉంటున్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మార్చి 10వ తేదీన ఆంజనేయులు పని నిమిత్తం hyderabad కి వెళ్ళాడు.తిరిగి ఇంటికి వచ్చేసరికి ఏడాదిన్నర బాబు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. నందిని ఇంట్లో కనిపించలేదు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, బంధువులు, తెలిసినవారిని విచారించి ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో భర్త ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. ఆమె ఆచూకీ తెలిసినవారు.. 94906 17010, 0845527633 నెంబర్లకు తెలియజేయాలన్నారు.
కాగా, ఏప్రిల్ 14న ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. భర్త ఇంట్లోలేని సమయంలో వివాహిత అదృశ్యమైన ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు, బాధిత కుటుంబం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంగళగిరి మండల పరిధిలోని ఎర్రబాలెం గ్రామంలో భార్యాభర్తలు నివాసముండేవారు. భర్త ఉద్యోగం చేస్తుండగా భార్య ఇంటివద్దే వుండేది. అయితే ప్రతిరోజూ మాదిరిగానే బుధవారం కూడా భర్త ఆఫీస్ కు వెళ్లగా ఇంట్లో వివాహిత ఒంటరిగా వుంది.
ఏమయ్యిందో తెలీదుగానీ భర్త డ్యూటీ ముగించుకుని సాయంత్రం ఇంటికివచ్చేసరికి భార్య కనిపించలేదు. ఇంటిచుట్టుపక్కల వెతికినా లాభం లేకపోవడంతో కంగారుపడిపోయిన అతడు కుటుంబసభ్యులకు, బంధువులకు సమాచారం ఇచ్చాడు. ఎక్కడా ఆమె ఆఛూకీ లభించకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న మంగళగిరి పోలీసులు కూడా వివాహిత ఆఛూకీ కోసం గాలిస్తున్నారు. ఆమెను ఎవరైనా బలవంతంగా ఎత్తుకుపోయారా లేక ఆమే ఇష్టపూర్వకంగా ఎక్కడికైనా వెళ్లిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిసి కెమెరాలు, ఫోన్ ట్రాకింగ్ ద్వారా యువతి ఆఛూకీ కనిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
