ప్రేమించి, పెద్దల్ని ఎదురించి పెళ్లి చేసుకున్న ఆ జంట జీవితాల్లో.. పదిహేనేళ్లకు విషాదం నిండింది. డబ్బు మీది ఆశ.. భార్యను వేధింపులకు గురిచేయగా ఆమె యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకుంది. 

ఉత్తరప్రదేశ్ : ఆ మహిళ తల్లిదండ్రులను ఎదురించి ప్రేమ వివాహం చేసుకుంది. ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యింది. వివాహం జరిగిన ఆరేళ్ల వరకు అంతా బాగానే ఉంది. ఆ తరువాత అతను మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ప్రేమించి తనతో వచ్చేసిన భార్యను పనిమనిషి కంటే హీనంగా చూసేవాడు. భార్యను, కొడుకును వదిలేసి ప్రేయసితోనే తిరిగేవాడ. భర్త ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్య యాసిడ్ తాగి చనిపోయింది. తాను చనిపోవడానికి రెండు రోజుల ముందు తండ్రికి ఫోన్ చేసి తన భర్త గురించిన అన్ని విషయాలు చెప్పింది. 

ఉత్తరప్రదేశ్ లోని ఇటావాకు చెందిన రవీంద్ర మిశ్రా (57) కుమార్తె పూనమ్ 2007 ఏప్రిల్ 29న నీరజ్ అనే యువకుడిని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యింది. పెళ్లైన ఆరేళ్లవరకు అంతా సవ్యంగానే సాగింది. ఆ తరువాతే నీరజ్ తన కూతురు పూనమ్ ను మానసికంగా హిసించడం ప్రారంభించాడు. రోజూ పూనమ్ ను వేధించేవాడు. నీ తండ్రి కట్నంగా రూపాయి కూడా ఇవ్వలేదని, నువ్వు పనిమనిషి కంటే మీనం అని మొహం మీదే చెప్పేవాడు. నువ్వు నాకు పెద్ద శత్రువువి. నా జీవితాన్ని నాశనం చేశావు. నీకు నా భార్య అయ్యే అర్హత లేదు. నువ్వు పనిమనిషితో సమానం అని భర్త అన్నట్టు పూనమ్ తన తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. 

సమోసాలో ఎలకల మందు కలిపి భర్తను చంపి, శవాన్ని గడ్డివాములో దాచి..ఏడాదిన్నర తరువాత అస్తిపంజరాన్ని అడవిలో పడేసి..

తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం కూడా పెట్టుకుని ఆమెతోనే ఉంటున్నాడని కూడా తండ్రికి చెప్పింది. తల్లిదండ్రులు పూనమ్ ను ఓదార్చి దీపావళి తరువాత ఇంటికి రమ్మని ఆహ్వానించారు. అయితే దీపావళి జరిగిన మూడు రోజుల తరువాత పూనమ్ తన ఇంట్లోనే యాసిడ్ తాగి చనిపోయింది. సమాచారం అందుకున్న పూనమ్ తండ్రి తన అల్లుడిమీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.