తనను మోసం చేసి మరో యువతిని పెళ్లి చేసుకోబోతున్నాడని ఆగ్రహించిన ఓ మహిళ మాజీ ప్రియుడిపై యాసిడ్ దాడి చేసింది. అతడు పెళ్లి పీటల మీద ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో పెళ్లికొడుకుతో పాటు పెళ్లి కూతురుకు కూడా గాయాలు అయ్యాయి. 

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో దారుణం జరిగింది. తనను ప్రేమించి వేరే యువతిని పెళ్లి చేసుకోబోతున్నాడని ఆగ్రహించిన ప్రియురాలి.. తన ప్రియుడిపై యాసిడ్ తో దాడి చేసింది. అతడు పెళ్లి పీటలు ఎక్కి తాళి కట్టేందుకు సిద్ధమువుతున్న సమయంలో ఇది చోటు చేసుకుంది. ఇది స్థానికంగా ఒక్క సారిగా కలకలం రేకెత్తించింది.

అకాల వర్షాలు.. తెలంగాణ సరిహద్దుల్లో పిడుగు పడి నలుగురి మృతి

వివరాలు ఇలా ఉన్నాయి. బస్తర్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల దమ్రుధర్ బాఘేల్ అదే ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతిని ప్రేమించాడు. కొన్నేళ్ల పాటు వీరి ప్రేమ వ్యవహారం కొనసాగింది. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో కొంత కాలం నుంచి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల 19 ఏళ్ల యువతితో దమ్రుధర్ కు వివాహం నిశ్చయమైంది. ఏప్రిల్ 19వ తేదీన పెళ్లి ముహుర్తంగా నిర్ణయించారు. 

మహారాష్ట్రలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు.. దానికి మేం సిద్దంగా ఉన్నాం - మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు

ఈ విషయం మాజీ ప్రేయసికి తెలిసింది. తాను మోసపోయానని గ్రహించింది. అతడిపై ఆగ్రహంతో యాసిడ్ దాడి చేయాలని నిర్ణయించుంది. భాన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛోటే అమాబల్ గ్రామంలో పెళ్లి పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో పురుషుడు వేశంలో ఆ యువతి వచ్చింది. ఆ సమయంలో మాజీ ప్రియుడు పెళ్లి పీటలపై పూజలు చేస్తున్నాడు. పెళ్లి కూతురు కూడా పక్కనే ఉంది. 

పూజలు కొనసాగుతున్న సమయంలో ఆమె ఒక్క సారిగా తన వెంట తెచ్చుకున్న యాసిడ్ ను పెళ్లి కొడుకు మీదికి విసిరింది. దీంతో అతడితో పాటు పక్కనే ఉన్న పెళ్లి కూతురుకు కూడా గాయాలు అయ్యాయి. మరో పది మంది కూడా స్వల్పంగా గాయపడ్డారు. అయితే సాయంత్రం కావడం, కరెంటు కూడా లేకపోవడంతో ఆ యువతి అక్కడి నుంచి పారిపోయింది. 

మహిళతో అశ్లీలంగా జార్ఖండ్ మంత్రి వీడియో కాల్.. షేర్ చేసిన బీజేపీ ఎంపీ.. ఇదే కాంగ్రెస్ లక్షణం అంటూ కామెంట్స్..

దీంతో స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు గమనించారు. అందులో పురుషుడి వేశంలో వచ్చిన యువతి ఈ యాసిడ్ దాడికి ఒడిగట్టిందని నిర్ధారించుకున్నారు. నిందితురాలిపై ఐపీసీ సెక్షన్ 326 ఏ కింద కేసు నమోదు చేశారు. ఆమెను ఆదివారం అరెస్టు చేసినట్లు బస్తర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ నివేదిత పాల్ తెలిపారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. యువకుడితో 14 ఏళ్ల బాలిక ప్రైవేట్ చాట్.. ఇంటికి పిలిచి లైంగిక దాడి..

కాగా.. ఈ నెల ప్రారంభంలో కబీర్‌ధామ్ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. మాజీ ప్రియురాలికి పెళ్లికి వెళ్లి కొత్త దంపతులకు హోమ్ థియేటర్ మ్యూజిక్ సిస్టమ్‌ గిఫ్ట్ గా ఇచ్చాడు. అందులో ఓ బాంబును అమర్చాడు. అది పేలడంతో ప్రియురాలి భర్త, అతడి అన్నయ్య మరణించారు.