ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయిన ఓ యువకుడు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించి అతడిపై ఫిర్యాదు చేసింది. 

ఆ బాలికకు 14 సంవత్సరాలు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. కొంత కాలం తరువాత వారిద్దరి మధ్య చాటింగ్ మొదలయ్యింది. దీంతో అతడు మరింత దగ్గరయ్యాడు. కొన్ని రోజుల అనంతరం ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. తరువాత ప్రైవేట్ గా చాట్ చేసుకున్నారు. ఆ చాట్ ను ఆసరాగా తీసుకొని ఆ యువకుడు బాలికను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఒక రోజు ఆ బాలికను తన ఇంటికి పిలుపించుకున్నాడు. తరువాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.

ఈత రాకపోయినా భార్య దూకిందనుకొని బావిలో దూకిన భర్త.. కానీ పొలంలోనే ఏడుస్తూ ఉన్న భార్య.. చివరికి ఏం జరిగిందంటే ?

వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలోని ఓ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలికకు గత సంవత్సరం సెప్టెంబర్ లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యవకుడితో పరిచయం అయ్యింది. ముందుగా కొంత కాలం పాటు వారిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లోనే చాటింగ్ చేసుకున్నారు. తరువాత వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దీంతో ఒకరి ఫోన్ నెంబర్లు మరొకరు మార్చుకున్నారు. తరువాత వారిద్దరూ ప్రైవేట్ చాట్ కొనసాగించారు. 

విషాదం.. కైవల్యా నదిలో మునిగి ఇద్దరు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన

ఇలా చాటింగ్ కొనసాగుతున్న సమయంలోనే ఆ యువకుడికి దుర్భుద్ది పుట్టింది. ఆ చాట్ ను ఆసరాగా చేసుకొని ఆమెపై బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డాలని నిర్ణయించుకున్నాడు. తమ ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్ ను బయటపెడతాను అంటూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. కొంత కాలం తరువాత ఆ బాలికను ఆ యువకుడు తన ఇంటికి రావాలని కోరాడు. దీంతో ఎక్కడ తన చాట్ భయటపడుతుందనే భయంతో అతడి చెప్పిన విధంగా చేసింది. అతడి ఇంటికి వెళ్లింది. 

అతిక్ అహ్మద్ ఆఫీసు ఎదుట హారన్ కొట్టినా.. బంధించి టార్చర్ పెట్టేవాడు - డాన్ హింసలు గుర్తు చేసుకున్న మహిళా రైతు

ఇంటికి వచ్చిన బాలికపై ఆ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని కూడా అతడు వీడియోతో పాటు ఫొటోలు కూడా తీశాడు. వాటి సాయంతో కూడా ఆ బాలికను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. తనతో పాటు తన స్నేహితులతోనూ గడపాలని బాలికను ఒత్తిడి తెచ్చాడు. అతడి చేష్టలతో బాలిక విసిగిపోయింది. వెంటనే సమీపంలోని పోలీసు స్టేషన్ ను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. ఆ యువకుడిపై ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ నిందితుడిపై పోక్సో చట్టం కింద, అలాగే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు.