Asianet News TeluguAsianet News Telugu

పంజాబ్ లో షాకింగ్ ఘటన.. శ్మశానవాటికలో వివాహం, విందుభోజనాలు..

పంజాబ్ లోని అమృత్‌సర్‌లో ఓ విచిత్ర వివాహం జరిగింది. శ్మశానవాటికలో ఓ జంట వివాహం చేసుకుంది. దీంతో ఈ పెళ్లి వైరల్ గా మారింది. 

Marriage performed, dinner arrenged in graveyard Shocking incident in Punjab - bsb
Author
First Published Feb 8, 2023, 11:01 AM IST

పంజాబ్‌ : పంజాబ్, అమృత్‌సర్‌లోని మోహకంపుర గ్రామంలోని ఓ శ్మశాన వాటికలో అసాధారణమైన వివాహం జరిగింది. స్మశాన వాటికలో పెళ్లా? వింటుంటేనే ఆశ్చర్యంతో, ఒకింత భయంతో రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి కదా.. ఇది నిజమే. వాస్తవంగానే జరిగింది. స్మశాన వాటికలో పెళ్లే కాదు. అక్కడే విందు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విచిత్ర ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెడితే..

మామూలుగా స్మశానం అనగానే.. భయపడుతుంటారు. అశుభంగా భావిస్తారు. శుభకార్యాల సమయంలో అటువైపుగా కూడా వెళ్లడానికి ఇష్టపడరు. కానీ పంజాబ్ లో ఓ జంట కొత్త జీవితాన్ని అక్కడే ప్రారంభించింది. అసలు విషయం ఏంటంటే..శ్మశానవాటిక సమీపంలో తన మనవరాలితో నివసించే ఓ వృద్ధురాలికి పెద్దగా ఆస్తి లేదు. దీంతో మనవరాలి పెళ్లి కోసం గ్రామస్థులను ఆశ్రయించింది.

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తో అరవింద్ కేజ్రీవాల్ భేటీ.. రాజ‌కీయాల్లో స‌రికొత్త చ‌ర్చ

ఆమె కోరిక మేరకు సాయం చేయడానికి అందరూ ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే వివాహ సన్నాహాల్లో సహకరించేందుకు గ్రామ పెద్దలు రంగంలోకి దిగి ఖర్చుల కోసం సంఘం నుంచి నిధులు సేకరించారు. ఈ క్రమంలోనే విచిత్రంగా, వివాహం స్మశానవాటికలో జరగాలని నిర్ణయించబడింది. అక్కడే పెళ్లి తరువాత రాత్రి భోజనం ఏర్పాటు చేయబడింది.

వివాహ వేడుక కోసం స్మశానంలో పెళ్లి మండపం, టెంట్లు.. ఆ హడావుడి అసాధారణం కావడంతో చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అయితే, విషయం తెలిసిన తరువాత ఆ వృద్ధురాలికోసం గ్రామస్తులు చేసిన సహాయం.. ఆమె మనవరాలి పెళ్లికి ముందుకు రావడం అందర్నీ మెప్పించాయి. దీంతో గ్రామస్తులు చేసిన ప్రయత్నాల మీద ప్రశంసలు కురుస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios