కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలా కుతలం చేస్తోంది. ఈ వైరస్ విలయతాండవంతో.. పలు దేశాల్లో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ఈ వైరస్ కి ముందు కనుగొనేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. కానీ పరిశోధనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.
Also Read భారత్ లో 10వేలకు చేరువలో కరోనా కేసులు.. 308మంది మృతి...

అయితే తాజాగా సముద్రంలో ఉండే నాచుకి కరోనాను ఎదుర్కొనే శక్తి ఉందని ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సముద్రంలో దొరికే ఓ రకమైన ఎరుపు రంగు నాచుతో కరోనాకి చెక్ పెట్టవచ్చని వారు చెబుతున్నారు. పొర్ఫీరీడియం సల్ఫేటెడ్ రకపు ఎరుపు నాచు నుంచి ఉత్పత్తి అయ్యే పాలీ శాచురైడ్‌లు.. శ్వాసకోశ సమస్యలకు కారణమయ్యే కరోనా కుటుంబానికి చెందిన వైరస్‌లను అడ్డుకొని.. బలమైన యాంటీ వైరల్ ఏజెంట్లుగా పనిచేస్తాయని వారు పేర్కొన్నారు. 

దీంతో.. కరోనా యాంటీ వైరల్ మందులే కాకుండా శానిటరైజ్ వస్తువులపై కూడా వైరస్ చేరకుండా కోటింగ్ వేయవచ్చని తమ రీసెర్చ్‌ ద్వారా శాస్త్రవేత్తలు తెలియజేశారు. దీనిపై కొందరిపై ప్రయోగించి ఆ తర్వాత మార్కెట్ లోకి విడుదల చేయాలని వారు భావిస్తున్నారు. మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.